ఇంటి పన్ను కడితేనే రేషన్‌ బియ్యం!

ABN , First Publish Date - 2020-03-30T10:22:11+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. ఇంటి పన్ను కడితేనే రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామంటూ నిర్బంధ వసూళ్లకు పాల్పడడంపై

ఇంటి పన్ను కడితేనే రేషన్‌ బియ్యం!

యాదాద్రి జిల్లా కొండంపేటలో నిర్బంధ వసూళ్లు

అడ్డగూడూరు, మార్చి 29: లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనుల్లేక సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. ఇంటి పన్ను కడితేనే రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామంటూ నిర్బంధ వసూళ్లకు పాల్పడడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని కొండంపేటలో ఇంటి పన్ను కడితేనే రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తామని సర్పంచ్‌, కార్యదర్శి చెప్పడంతో ఈనెల 27న గ్రామస్థులందరూ పన్నులు చెల్లించారు. అసలే పనుల్లేక ఇబ్బందులు పడుతుంటే నిర్బంధంగా పన్నులు కట్టించుకున్నారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే, గ్రామస్థులే స్వచ్ఛందంగా ఇంటి పన్నులు చెల్లించారని, తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదని పంచాయతీ కార్యదర్శి ఉదయ్‌కుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-03-30T10:22:11+05:30 IST