భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2022-01-25T04:32:37+05:30 IST

తర్లుపాడు మండలంలోని మేకలవారిపల్లె టోల్‌ ప్లాజా వద్ద సోమవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు.

భారీగా రేషన్‌ బియ్యం పట్టివేత
స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం లారీ

తర్లుపాడు, జనవరి 24 : మండలంలోని మేకలవారిపల్లె టోల్‌ ప్లాజా వద్ద సోమవారం లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఎస్‌ఐ మల్లవరపు సువర్ణ తెలిపారు. యర్రగొండపాలెం సాయికృష్ణ ట్రేడర్స్‌ రైస్‌ మిల్‌ నుంచి లారీలో కృష్ణపట్నం ఎయిర్‌పోర్టుకు బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే లారీతోపాటు బియ్యాన్ని సీజ్‌ చేశారు. బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు అప్పగిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


6 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

కొండపి, జనవరి 24 : మండలంలోని చోడవరం గ్రామంలో రావిపా టి అనుసూర్యమ్మ అనే మహిళ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన ఆ రు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని సోమవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సింగరాయకొండ డీటీ కె.ఆర్‌. భూపతి స్వాధీనం చేసుకున్నారు. బి య్యాన్ని వెన్నూరు డీలర్‌ ధనలక్ష్మికి అప్పగించామని డీటీ చెప్పారు. అ నుసూర్యమ్మపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. ఈమె భర్త గతంలో చోడవరంలో డీలర్‌గా పనిచేశారని గ్రామస్థులు తెలిపారు. డీలర్‌షిప్‌ లేకపోయినా గతంలో కూడా జనం నుంచి రేషన్‌ బియ్యాన్ని సొంతంగా కొనుగోలు చేసి విక్రయించేదని తెలిసింది. రేషన్‌ డీలర్లకన్నా అధిక రేట్లకు ఈమె కొనుగోలు చేస్తుండటంతో గ్రామస్థులు ఈమెకే బియ్యాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం ఈమె ఇంటిపై దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2022-01-25T04:32:37+05:30 IST