Abn logo
Sep 21 2021 @ 01:15AM

రేషన్‌.. సర్వర్‌ డౌన్‌

ఒంగోలు (కలెక్టరేట్‌), సెప్టెంబరు 20 : కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో రెండో విడత ఉచితంగా ఇస్తున్న రేషన్‌ పంపిణీకి సర్వర్‌ అడ్డంకిగా మారింది. ఆదివారం నుంచి జిల్లాలోని రేషన్‌షాపుల వద్ద పంపిణీ ప్రారంభం కాగా సోమవారం  సర్వర్‌ సక్రమంగా పని చేయకపోవడంతో కార్డు దారులు గంటల తరబడి ఆయా రేషన్‌షాపుల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి విడత రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన బియ్యాన్ని మొబైల్‌ వాహనం ద్వారా పంపిణీ చేయగా, రెండోవిడత కేంద్రప్రభుత్వ ఉచిత కోటాను రేషన్‌షాపుల ద్వారా ఇస్తున్నారు. అయితే సర్వర్‌ పడిపోతుండటంతో ఒక్కొక్క షాపు వద్ద పది కార్డులకు కూడా రేషన్‌ అందని పరిస్థితి ఏర్పడింది.