10న రేషన్ షాపుల బంద్

ABN , First Publish Date - 2021-05-08T21:20:10+05:30 IST

రేషన్ డీలర్లపై అధికారుల వైఖరీకి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ ఉంటుందని ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు తెలిపారు.

10న రేషన్ షాపుల బంద్

అమరావతి: రేషన్ డీలర్లపై అధికారుల వైఖరీకి నిరసనగా మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్‌కి పిలుపు నిచ్చినట్లు ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం లోపాలను సరి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో సగం మంది ఎండీయీలు రేషన్ పంపిణీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న డోర్ డెలివరీ రేషన్ పంపిణీపై విజిలెన్స్ ఎంక్వయిరీ వేయాలని దీనిలో ఉన్న లోపాలను ముఖ్యమంత్రి జగన్ గుర్తించాలని చెప్పారు. ఎండీయూలు చేయాల్సిన పంపిణీని డీలర్లు చేయాలని వత్తిడికి గురి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న డీలర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్స్ వేయించి, డీలర్లకు భీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని మండాది వెంకట్రావు కోరారు. 

Updated Date - 2021-05-08T21:20:10+05:30 IST