సేలం ఆసుపత్రి ఐసీయూలో ఎలుకల సంచారం

ABN , First Publish Date - 2020-10-21T12:17:05+05:30 IST

కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో సేలం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రోగుల మధ్య...

సేలం ఆసుపత్రి ఐసీయూలో ఎలుకల సంచారం

సోషల్ మీడియాలో వీడియో వైరల్

సేలం (తమిళనాడు): కరోనా మహమ్మారి ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో సేలం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో రోగుల మధ్య ఎలుకలు స్వైరవిహారం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సేలం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగుల చుట్టూ ఎలుకలు తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి. ఐసీయూలో మంచంపై ఇద్దరు రోగులు, నేలపై కూడా రోగులున్న వీడియో బయటపడింది. 


సేలం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఎలుకలు స్వేచ్ఛగా వైద్యపరికరాలు, ఆక్సిజన్ పైపులు, రోగుల చుట్టూ తిరుగుతుండటం బయటపడింది.ఎలుకల బెడద మధ్య రోగులకు వైద్యులు ఎలా చికిత్స చేస్తున్నారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఐసీయూలో ఎలుకల సంచారం వీడియో వెలుగుచూశాక వీటి నివారణకు చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అధికారులు హామీ ఇచ్చారు.

Updated Date - 2020-10-21T12:17:05+05:30 IST