రేవ్ పార్టీలో బిగ్‌బాస్ మాజీ పోటీదారు...22 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-28T15:19:27+05:30 IST

విల్లాల్లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్‌బాస్ మాజీ పోటీదారుతోపాటు 22 మందిని అరెస్ట్ చేసిన ఘటన...

రేవ్ పార్టీలో బిగ్‌బాస్ మాజీ పోటీదారు...22 మంది అరెస్ట్

ముంబై (మహారాష్ట్ర): విల్లాల్లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న బిగ్‌బాస్ మాజీ పోటీదారుతోపాటు 22 మందిని అరెస్ట్ చేసిన ఘటన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఇగత్‌పురి పట్టణంలో వెలుగుచూసింది. ఇగత్‌పురి పట్టణంలోని రెండు విల్లాల్లో రేవ్ పార్టీ సాగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో బిగ్ బాస్ రియాలిటీ షో మాజీ పోటీదారుతోపాటు 12 మంది మహిళలు, 10 మంది పురుషులను పోలీసులు అరెస్టు చేశారు. రేవ్ పార్టీలో నలుగురు దక్షిణ భారత సినీపరిశ్రమతో సంబంధం ఉన్న వారు కూడా పాల్గొన్నారు. 




రేవ్ పార్టీ గురించి సమాచారం అందడంతో తాము విల్లాలపై దాడడి చేశామని నాసిక్ ఎస్పీ సచిన్ పాటిల్ చెప్పారు. స్కై తాజ్, స్కై లగూన్ విల్లాల్లో జరిగిన రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు, హుక్కాలను స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని అరెస్టు చేసి, వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాల చట్టం కింద 22 మందిపై కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. రేవ్ పార్టీకి వచ్చిన వ్యక్తులు హైఎండ్ కార్లలో వచ్చారని, ఈ పార్టీ నిర్వాహకుల కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. 

Updated Date - 2021-06-28T15:19:27+05:30 IST