Abn logo
Aug 3 2021 @ 17:11PM

గుంటూరులో రేవ్ పార్టీ

గుంటూరు: జిల్లాలో జరిగిన రేవ్ పార్టీ కలకలం సృష్టిస్తోంది. లక్ష్మీపురంలో గల ఓ భవనంలో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసారు. పార్టీలో పాల్గొన్న ఐదురుగు మహిళలు, 30 మంది యువకులను పట్టాభిపురం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల దాడి సమయంలో నలుగురు ప్రముఖులు తప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.