లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోవడంతో కాటికాపరిగా మారిన యువకుడు!

ABN , First Publish Date - 2021-04-24T17:26:40+05:30 IST

దేశంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో...

లాక్‌డౌన్‌లో ఉద్యోగం పోవడంతో కాటికాపరిగా మారిన యువకుడు!

వడోదర: దేశంలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో స్మశానవాటికలకు తరలి వస్తున్న మృతదేహాల సంఖ్య  అధికంగానే ఉంటోంది. ఇటువంటి సమయంలో ఒక కాటికాపరి వార్తల్లో నిలిచాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన ఒక యువకుడు స్మశాన వాటికనే తన నివాసంగా మార్చుకున్నాడు. అంతేకాదు ఇక్కడికి వచ్చే మృతదేహాలకు అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నాడు. ఈ పనిలో అతని భార్య కూడా అతనికి సహకారం అందిస్తోంది. 


వివరాల్లోకి వెళితే గుజరాత్‌లోని వడోదరలో గల ఒక స్మశానవాటికలో మహారాష్ట్రకు చెందిన కన్నయ్యాలాల్ కాటికాపరిగా ఉంటున్నాడు. ఇక్కడకు వచ్చే మృతదేహాల అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులు చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్‌లో ఉద్యోగం కోల్పోయినప్పటి నుంచి కన్నయ్యాలాల్ ఏడాదిగా వడోదర పరిధిలోని వాసనా గ్రామంలోని స్మశాన వాటిక దగ్గరే ఉంటున్నాడు. ఇక్కడికి వస్తున్న కరోనా మృతదేహాలకు సైతం అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు.

Updated Date - 2021-04-24T17:26:40+05:30 IST