కేబీసీలో రూ. కోటి గెలిచిన ఆ చిన్నారి ఇప్పుడు ఎస్పీ!

ABN , First Publish Date - 2020-05-29T01:22:11+05:30 IST

పాపులర్ గేమ్‌ షో కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) స్పెషల్ ఫార్మాట్ కేబీసీ జూనియర్ (2001)లో కోటి రూపాయలు

కేబీసీలో రూ. కోటి గెలిచిన ఆ చిన్నారి ఇప్పుడు ఎస్పీ!

ముంబై: పాపులర్ గేమ్‌ షో కౌన్ బనేగా క్రోర్‌పతి (కేబీసీ) స్పెషల్ ఫార్మాట్ కేబీసీ జూనియర్ (2001)లో కోటి రూపాయలు గెలుచుకున్న 14 ఏళ్ల రవి మోహన్ సైనీ ఇప్పుడు ఐపీఎస్ అధికారి. మొత్తం 15 ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పిన రవి మోహన్ కోటి రూపాయలు గెలుచుకుని అప్పట్లో రికార్డులకెక్కాడు.  ప్రస్తుతం 33 ఏళ్ల వాడైన సైనీ మంగళవారం పోర్‌బందర్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు.


ఈ సందర్భంగా ఓ జాతీయ దినపత్రికతో సైనీ మాట్లాడుతూ.. జైపూర్‌లోని మహాత్మాగాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసినట్టు తెలిపాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఇంటర్నెషిప్ చేశానని, తన తండ్రి నేవీ ఉద్యోగి కావడంతో ఆయన స్ఫూర్తితో యూపీఎస్‌సీ పూర్తి చేసి పోలీస్ ఫోర్స్‌లో చేరినట్టు పేర్కొన్నాడు. అఖిల భారత స్థాయిలో 461 ర్యాంకు సాధించిన తర్వాత సైనీ 2014లో ఇండియన్ పోలీస్ సర్వీసులో చేరాడు. ప్రస్తుతం తాను పోర్‌బందర్లో లాక్‌డౌన్ విధుల్లో ఉన్నట్టు తెలిపాడు.  

Updated Date - 2020-05-29T01:22:11+05:30 IST