ఆసీస్ టూర్‌లో దక్కని చోటు.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి ట్వీట్

ABN , First Publish Date - 2020-10-30T01:47:22+05:30 IST

టు దేశవాళీ క్రికెట్‌లోనూ, ఇటు ఐపీఎల్‌లోనూ ఇరగదీస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంఅందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆసీస్ టూర్‌లో దక్కని చోటు.. సూర్యకుమార్‌కు రవిశాస్త్రి ట్వీట్

న్యూఢిల్లీ: అటు దేశవాళీ క్రికెట్‌లోనూ, ఇటు ఐపీఎల్‌లోనూ ఇరగదీస్తున్న సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంఅందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ కూడా ఈ పర్యటనకు అందుబాటులో లేడు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో సూర్యకుమార్‌ పేరు లేకపోవడాన్ని హర్భజన్ సింగ్, మనోజ్ తివారీ, దిలీప్ వెంగ్‌సర్కార్ వంటి వారు తప్పుబట్టారు. సెలక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.   


వెల్లువెత్తుతున్న విమర్శలపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఆశావాద దృక్పథంతో ఉండాలని, సహనంగా, దృఢంగా ఉండాలంటూ ట్విట్టర్ ద్వారా సూర్యకుమార్‌ను కోరాడు. బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ అద్భుతంగా ఆడాడు. 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 79 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో యాదవ్‌కు ఇది ఐదో అర్ధ సెంచరీ. ఇప్పటి వరకు జరిగిన 12 మ్యాచుల్లో 362 పరుగులు చేశాడు.    

Updated Date - 2020-10-30T01:47:22+05:30 IST