ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రవిని నియమించాలి

ABN , First Publish Date - 2022-01-24T06:44:39+05:30 IST

తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర వహించిన ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెడపట్ల దుబ్బయ్య, సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రవిని నియమించాలి
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు

తెలంగాణ మాదిగ జేఏసీ నాయకుల డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జనవరి 23: తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర వహించిన ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవిని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మెడపట్ల దుబ్బయ్య, సంఘ నాయకులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమంలో కేసులు నమోదై జైలుకు వెళ్లిన పిడమర్తి రవికి మరోసారి చై ర్మన్‌గా అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సం ఘ సభ్యులు మహేష్‌, శ్రీనివాస్‌, రవికుమార్‌, రాజేంధర్‌, శివకుమార్‌ తదితరులున్నారు. 


Updated Date - 2022-01-24T06:44:39+05:30 IST