Abn logo
Apr 9 2021 @ 00:44AM

కొత్త దర్శకుడితో రవితేజ?

తెరపైన వినోదం పండించటంలో హీరో రవితేజది ట్రేడ్‌మార్క్‌. తనదైన డైలాగ్‌ డెలివరీ, హావభావాలతో అలవోకగా ఆయన హాస్యాన్ని పండిస్తారు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న చిత్రం ‘ఖిలాడి’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీని తర్వాత ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. తాజాగా రవితేజ మరో చిత్రం అంగీకరించారని టాక్‌. ‘విరాటపర్వం’ సినిమా నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ఓ కొత్త దర్శకుడితో ఈ చిత్రం రూపొందించనున్నారట. యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ పొడక్షన్‌ వర్క్‌ జరుగుతోందని సమాచారం. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Advertisement
Advertisement
Advertisement