Abn logo
Jan 14 2021 @ 10:01AM

తొలి చెక్ నాగార్జున ఇచ్చారు: రవితేజ

సంక్రాంతి సందర్భంగా ఇటీవల విడుదలైన `క్రాక్` సినిమా మాస్ మహారాజ్ రవితేజలో ఫుల్ జోష్ నింపింది. వరుస పరాజయాలకు చెక్ పెట్టి రవితేజను మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. `క్రాక్` సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న రవితేజ తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. 


తను తీసుకున్న మొదటి చెక్ గురించి మాట్లాడాడు. `నేను `నిన్నేపెళ్లాడతా` సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. సినిమా పూర్తయ్యాక నాగార్జున సంతకం చేసిన చెక్ చేతికిచ్చారు. మూడువేల ఐదు వందల రూపాయల చెక్ అది. దానిని చాలారోజులు భద్రంగా దాచుకున్నాను. తర్వాత డబ్బులు బాగా అవసరమై చెక్ బ్యాంకులో ఇచ్చేశాన`ని రవితేజ చెప్పాడు. 

Advertisement
Advertisement
Advertisement