Oct 15 2021 @ 18:53PM

రవితేజ మళ్ళీ డబుల్ ‘ధమాకా’ నా?

‘ఓ పనైపోతుంది బాబూ, విక్రమార్కుడు, దరువు, కిక్ 2’ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయంలో మెప్పించారు రవితేజ. ఇప్పుడు మరో రెండు సినిమాల్లో సైతం రవితేజ డబుల్ రోల్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం సెట్స్ మీదున్న రమేశ్ వర్మ ‘ఖిలాడీ’లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మరో సినిమాలో కూడా రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నట్టు సమాచారం. దసరా సందర్భంగా ఈ రోజు టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగిన ‘ధమాకా’ లో కూడా రవితేజ రెండు పాత్రలతో వినోదాన్ని పండించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. 


ప్రస్తుతం రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాని కూడా ట్రాక్ లో పెట్టారు. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతోన్నఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం నాలుగు సినిమాలతో రవితేజ డైరీ నిండిపోయింది. ఈ ఏడాదిని  ‘క్రాక్’ బ్లాక్ బస్టర్ తో బోణీ చేసిన మాస్  మహారాజా ఈ మూవీస్ తో ఇంకే రేంజ్ లో హిట్స్ సొంతం చేసుకుంటారో చూడాలి.