Abn logo
Jul 7 2020 @ 10:06AM

చిరు సినిమా పంథాలో..?

క‌రోనా కార‌ణంగా ‘క్రాక్’ సినిమాతో ఈ వేస‌విలో అభిమానుల‌ను అల‌రించాల‌నుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ స్పీడుకు బ్రేకులు ప‌డ్డాయి. అయితే ఈ గ్యాప్‌లో ర‌వితేజ కొత్త సినిమాలు చేయ‌డానికి ఓకే చెప్పారు. అందులో ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయనున్నారు. కాగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ర‌వితేజ ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాల్లో త్రినాథ‌రావు న‌క్కిన సినిమా కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నుంద‌ట‌. గ‌తంలో చిరంజీవి హీరోగా న‌టించిన ‘చంట‌బ్బాయి’ సినిమా త‌ర‌హా క‌థాంశంతో త్రినాథ‌రావు న‌క్కిన కథను తయారు చేసుకున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

Advertisement
Advertisement
Advertisement