చిరు సినిమాకి రవితేజ అంత తీసుకుంటున్నారా?

మెగాస్టార్ చిరంజీవి 154 సినిమాగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వాల్తేర్ సముద్రతీరం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్ళింది. ఈ మూవీతో చిరంజీవిని వింటేజ్ మాస్ లుక్ లో ఎలివేట్ చేయబోతున్నాడు దర్శకుడు. అందులోని ఆయన మేకోవర్ అభిమానుల్ని అలరిస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు తమ్ముడిగా రవితేజ నటిస్తున్నట్టు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటూండడంతో రవితేజ ఈ పాత్రకు ఒప్పుకున్నారు. ఈ సినిమాకోసం రవితేజ షాకింగ్ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. 


తాజా సమాచారం ప్రకారం చిరు 154 కోసం రవితేజ ఏకంగా రూ.7కోట్లు పారితోషికం అందుకుంటున్నారట. దీనికోసం ఆయన బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా  జనవరి నుంచి రవితేజ పోర్షన్ షూట్ చేయబోతున్నారని టాక్. ఇంతకు ముందు ‘అన్నయ్య’లో రవితేజ చిరుకి తమ్ముడిగా నటించగా, ‘శంకర్‌దాదా జిందాబాద్’ లో ఒక పాటలో రవితేజ కనిపిస్తారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రానున్న ఈ మూడో సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Advertisement
Advertisement