వేదాంత చేతికి వీడియోకాన్‌ రవ్వ చమురు క్షేత్రం

ABN , First Publish Date - 2021-06-10T09:03:18+05:30 IST

దేశీయ చమురు, సహజ వాయువుల ఉత్పత్తి రంగంలో వేదాంత గ్రూప్‌ పట్టు పెంచుకుంటోంది. తాజాగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు కేజీ బేసిన్‌లోని ‘రవ్వ’ క్షేత్రంలో ఉన్న చమురు, సహజ వాయువుల బ్లాక్‌ను కొనుగోలు చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఈ ఆస్తుల కోసం వేదాంత గ్రూప్‌ అనుబంధ కంపెనీ ట్విన్‌ స్టార్‌

వేదాంత చేతికి వీడియోకాన్‌ రవ్వ చమురు క్షేత్రం

న్యూఢిల్లీ: దేశీయ చమురు, సహజ వాయువుల ఉత్పత్తి రంగంలో వేదాంత గ్రూప్‌ పట్టు పెంచుకుంటోంది. తాజాగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు కేజీ బేసిన్‌లోని ‘రవ్వ’ క్షేత్రంలో ఉన్న చమురు, సహజ వాయువుల బ్లాక్‌ను కొనుగోలు చేసింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఈ ఆస్తుల కోసం వేదాంత గ్రూప్‌ అనుబంధ కంపెనీ ట్విన్‌ స్టార్‌ టెక్నాలజీస్‌ వేసిన బిడ్‌ను ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఆమోదించింది. ఇందుకోసం కంపెనీ ముందుగా నాలుగు కోట్ల డాలర్లు (సుమారు రూ.292 కోట్లు) చెల్లిస్తుంది. రవ్వ క్షేత్రంలో వీడియోకాన్‌ గ్రూప్‌నకు 47.5 శాతం వాటా ఉంది. అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంత గ్రూప్‌ ఇప్పటికే రాజస్థాన్‌లోని బార్మర్‌ జిల్లాలో చమురు ఉత్పత్తి బ్లాక్‌ను నిర్వహిస్తోం ది. రవ్వ బ్లాకు నుంచి రోజుకు 22వేల బ్యారళ్ల చమురు, అందుకు సమానమైన గ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చు. 

Updated Date - 2021-06-10T09:03:18+05:30 IST