Abn logo
Oct 13 2021 @ 12:09PM

రాయచూరు జిల్లాధికారి సతీశ్‌ ఆకస్మిక బదిలీ

                   - కొత్త జిల్లాధికారిగా చారులతా సోమల్‌


రాయచూరు(కర్ణాటక): కేవలం మూడు నెలల క్రితమే జిల్లాధికారిగా వచ్చిన డాక్టర్‌ బీసీ సతీశ్‌ ఆకస్మిక బదిలీ అయ్యారు. ఆయనను రాయచూరు నుంచి బదిలీ చేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొడుగు జిల్లాధికారిగా పనిచేస్తున్న చారులతా సోమల్‌ను రాయచూరుకు నూతన జిల్లాధికారిగా ప్రభుత్వం నియమించింది. కాగా జిల్లాలోని స్థితిగతులపై అవగాహన చేసుకునే లోపుగానే జిల్లాధికారిని బదిలీ చేయడం పట్ల రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోను తీవ్ర అసంతృప్తి, దిగ్ర్భాంతి వ్యక్తమైంది. 

ఇవి కూడా చదవండిImage Caption