రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-09-17T05:28:58+05:30 IST

రాషా్ట్రనికి ప్రత్యేక హోదా, రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం గురువారం కడపలోని వినాయకనగర్‌ సర్కిల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమై అల్మాస్‌పేట, వన్‌టౌన్‌, గోకుల్‌, శంకరాపురం, అప్సరా మీదుగా బైపాస్‌ వద్ద ముగిసింది.

రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలి
కడప వనటౌన గాంధీ సర్కిల్‌ వద్ద వామపక్ష నాయకుల పాదయాత్ర

కేంద్రం అడుగుజాడల్లో సీఎం జగన్‌ 

పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర నాయకుల మండిపాటు

కడప (రవీంద్రనగర్‌), సెప్టెంబరు 16: రాషా్ట్రనికి ప్రత్యేక హోదా, రాయలసీమ అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం గురువారం కడపలోని వినాయకనగర్‌ సర్కిల్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమై అల్మాస్‌పేట, వన్‌టౌన్‌, గోకుల్‌, శంకరాపురం, అప్సరా మీదుగా బైపాస్‌ వద్ద ముగిసింది. కార్యక్రమానికి టీడీపీ, సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో పేద వర్గాలు, ఉద్యోగులు ఉపాధి కోల్పోయారన్నారు. పెట్టుబడిదారుల ఆస్తులు మాత్రం పెరిగాయన్నారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అందరం పోరాడాలన్నారు. పెట్రో ధరలు పెరగడానికి కారణం కేంద్రమని, టీడీపీ కేంద్రాన్ని ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతోందని వైసీపీ ప్రభుత్వం ఇందుకు తక్కువేమీ కాదని, కేంద్రానికి కొమ్ము కాస్తోందని తెలిపారు. సీఎం జగన్‌ కేంద్రం అడుగుజాడల్లో పనిచేస్తున్నారని, ఉచిత విద్యుత్‌ రద్దు చేసి మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుని రాజన్న రాజ్యం అనడంలో అర్థం ఏమిటన్నారు. ఈనెల 27న రాజకీయ పార్టీలు నిర్వహించే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, పి.హరినాధరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రనాయక్‌ బృందం ఆలపించిన విప్లవ గేయాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకటశివ, కార్యవర్గ సభ్యుడు క్రిష్ణమూర్తి, రామయ్య, నాగసుబ్బారెడ్డి, బషీరున్నిసా, చంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నీలి శ్రీనివాసులు, విష్ణుప్రీతంరెడ్డి, టీడీపీ నాయకులు హరిప్రసాద్‌, అమీర్‌బాబు, ముక్తియార్‌, రాంప్రసాద్‌, సంఘ సేవకుడు సలావుద్దీన్‌, సీఐటీయూ మనోహర్‌, రైతు సంఘం నాయకుడు ఆర్‌ఎన్‌ రాజా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T05:28:58+05:30 IST