Abn logo
Nov 22 2020 @ 19:55PM

ఆర్బీఐ ప్రపంచ రికార్డు...

Kaakateeya

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. ఆర్బీఐ ట్విట్టర్ హ్యాండిల్‌‌ 10 లక్షల మంది ఫాలోవర్లను దాటింది. ప్రపంచంలోనే వన్ మిలియన్ ఫాలోవర్లను దాటిన మొదటి సెంట్రల్ బ్యాంకుగా నిలిచింది. ఈ సందర్భంగా తన సహచర సిబ్బందిని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అభినందించారు. శక్తికాంత దాస్‌కు వేరేగా ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. దీనికి 1.37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

'ఆర్బీఐ ట్విటర్ అకౌంట్ ఇవాల్టితో 10 లక్షల మంది ఫాలోవర్లను చేరింది. ఇదొక మైలురాయి. ఆర్బీఐలోని నా సహచరులందరికీ అభినందనలు' అని శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌‌ను అధిగమించి ఆర్బీఐ 10 లక్షల మంది ఫాలోవర్లను దాటింది. ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్బీఐ ట్విట్టర్ హ్యాండిల్‌ను 10,00,513 మంది ఫాలో చేస్తున్నారు.

Advertisement
Advertisement