రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం... ఈ బ్యాంకుపై ఆం క్షల ఎత్తివేత...

ABN , First Publish Date - 2021-04-07T02:27:29+05:30 IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్తను చెప్పింది. ఈ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.

రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం... ఈ బ్యాంకుపై ఆం క్షల ఎత్తివేత...

ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్తను చెప్పింది. ఈ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది.


కోలాపూర్ కేంద్రంగా యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో బ్యాంక్ కస్టమర్లకు ఊరట కలగనుంది. రిజర్వ్ బ్యాంక్ యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై 2019 జనవరిలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 


ఆర్‌బీఐ యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై పలు ఆంక్షలు విధించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడం వల్ల విత్‌డ్రాయెల్ లిమిట్‌ను రూ. 5 వేలకే పరిమితం చేసింది. తొలిగా ఆరు నెలలు విధించిన ఈ ఆంక్షలను... ఆ తర్వాత పొడిడించింది.


యూత్ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సంతృప్తికరంగానే కనిపిస్తోందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ క్రమంలో... బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బ్యాంక్ కస్టమర్లు ఎప్పటిమాదిరిగానే వారి బ్యాంక్ సేవలు పొందొచ్చు. ఎలాంటి పరిమితులూ ఉండబోవు.

Updated Date - 2021-04-07T02:27:29+05:30 IST