డిజిటల్‌ కరెన్సీ కాలంలోనూనగదుకు మనుగడ

ABN , First Publish Date - 2021-10-19T08:09:24+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టినప్పటికీ.. భౌతిక రూపంలో నగదు చలామణి కొనసాగుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు.

డిజిటల్‌ కరెన్సీ కాలంలోనూనగదుకు మనుగడ

 ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టినప్పటికీ.. భౌతిక రూపంలో నగదు చలామణి కొనసాగుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అన్నారు. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి పొంచి ఉన్న ముప్పుల్లో సైబర్‌ భద్రత ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. గోప్యత కూడా సమస్యగా పరిణమించవచ్చన్నారు. సోమవారం ఎన్‌సీఏఈఆర్‌ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టాక ద్రవ్య సరఫరా నియంత్రణపై ఆర్‌బీఐ పట్టు తగ్గవచ్చని, ఆర్థిక స్థిరత్వం కూడా సమస్యగా మారవచ్చన్నారు. క్రిప్టో కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా అధికారిక డిజిటల్‌ కరెన్సీని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించింది. 


‘క్రిప్టో’లను నియంత్రించాల్సిందే:

బిట్‌కాయిన్‌, ఎంథిరమ్‌ వంటి క్రిప్టో లేదా వర్చువల్‌ కరెన్సీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని సుబ్బారావు అన్నారు. భారత్‌, చైనా వంటి దేశాల నుంచి సొమ్మును బయటి దేశాలకు తరలించేందుకు, మనీలాండరింగ్‌కు క్రిప్టో కరెన్సీలు ప్రఽధాన వాహకాలు కాగలవన్నా రు. అయినప్పటికీ, స్పెక్యులేటివ్‌ అసెట్స్‌గా క్రిప్టోలు కొనసాగుతాయని తెలిపారు.

Updated Date - 2021-10-19T08:09:24+05:30 IST