ఇకపై పేటీఎంలాంటి డిజిటల్ వాలెట్ల నుంచి నగదు పొందవచ్చు : ఆర్బీఐ

ABN , First Publish Date - 2021-04-07T20:02:54+05:30 IST

నాన్ బ్యాంకింగ్ సంస్థల కస్టమర్లు ఇకపై చాలా ముఖ్యమైన సేవలను

ఇకపై పేటీఎంలాంటి డిజిటల్ వాలెట్ల నుంచి నగదు పొందవచ్చు : ఆర్బీఐ

ముంబై : నాన్ బ్యాంకింగ్ సంస్థల కస్టమర్లు ఇకపై చాలా ముఖ్యమైన సేవలను పొందే అవకాశం రాబోతోంది. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేటీఎం వంటి డిజిటల్ వాలెట్ల కస్టమర్లకు శుభవార్త చెప్పింది. పూర్తిగా కేవైసీ (నో యువర్ కస్టమర్) నిబంధనలను పాటించే కస్టమర్లు పేటీఎం వంటి నాన్ బ్యాంక్ ఎంటిటీస్ నుంచి నగదును తీసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే  ఇటువంటి ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్)కు పరిమితి విధిస్తామని తెలిపింది. 


ఇప్పటి వరకు బ్యాంకులు పూర్తిగా కేవైసీ నిబంధనలను పాటించే కస్టమర్లకు ప్రీ-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పీపీఐ)ను జారీ చేస్తున్నాయి. వీటి ద్వారా కస్టమర్లు నగదును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఉంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ నుంచి ఈ పీపీఐల ద్వారా నగదును తీసుకోవడానికి అనుమతి ఉంది. ఈ చర్య వల్ల సంస్థలు ఒకదానితో మరొకటి కలిసి పని చేయగలగడంతోపాటు పూర్తి స్థాయిలో కేవైసీ పీపీఐలకు మారడానికి  ప్రోత్సాహం లభిస్తుంది. టైర్-3 నుంచి టైర్-6 సెంటర్ల వరకు యాక్సెప్టెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరింత పటిష్టమవుతుంది. దీనికి అవసరమైన ఆదేశాలను ప్రత్యేకంగా జారీ చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. 


యూపీఐ ఇంటర్‌ఆపరబిలిటీని (పరస్పరం కలిసి పని చేయగలిగే సామర్థ్యాన్ని) కల్పించేందుకు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సదుపాయాలను డిజిటల్ పేమెంట్స్ ఇంటర్మీడియరీస్ లేదా నాన్-బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లకు ఆర్బీఐ విస్తరించింది. ఇప్పటి వరకు ఈ సదుపాయాలు కేవలం బ్యాంకులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పేమెంట్స్ బ్యాంక్‌కు గరిష్ఠ రోజువారీ బ్యాలెన్స్‌ను రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెంచింది. 


ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం మాట్లాడుతూ, ఈ చర్య వల్ల ఆర్థిక వ్యవస్థలో రిస్క్ సెటిల్‌మెంట్‌ కనిష్ట స్థాయికి తగ్గుతుందని చెప్పారు. అంతేకాకుండా ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంచుతుందని చెప్పారు. పెరుగుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పేమెంట్స్ బ్యాంక్‌లు సేవలందించగలుగుతాయని వివరించారు. 


Updated Date - 2021-04-07T20:02:54+05:30 IST