Oct 12 2021 @ 08:35AM

'RC 15': హాట్ టాపిక్ అవుతున్న చరణ్ రెమ్యునరేషన్..?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఆయన హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. దీనికి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. ఈ మూవీ చరణ్‌కి 15, నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కి 50వది కావడం విశేషం. అందుకే నిర్మాత దిల్ రాజు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చరణ్ ఈ సినిమాకి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలలో ప్రభాస్ తర్వాత చరణ్ అవుతాడు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా, అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.