చెన్నై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)కు చెందిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ డానియల్ శామ్స్ కొవిడ్ బారినపడ్డాడు. 28 ఏళ్ల శామ్స్ కరోనా నెగెటివ్ నివేదికతో ఈనెల 3న భారత్ చేరుకొని జట్టుతో కలిశాడని ఆర్‌సీబీ తన ట్విటర్‌లో వెల్లడించింది. అయితే తాజాగా బుధవారం రెండోసారి కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చిందని, కానీ అతడికి కొవిడ్ లక్షణాలు లేవని వివరించింది. ఇక వైరస్ సోకిన ఓపెనర్ దేవదత్ పడిక్కళ్ కోలుకొని జట్టులో చేరడం బెంగళూరుకు ఊరట నిచ్చింది.