Abn logo
Sep 18 2021 @ 20:14PM

IPL 2021: కోల్‌కతాతో మ్యాచ్‌లో బ్లూ జెర్సీ ధరించనున్న ఆర్సీబీ.. ఆ తర్వాత దానిని ఏం చేస్తారంటే?

యూఏఈ: ఐపీఎల్‌ రెండో విడతలో భాగంగా ఈ నెల 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు బ్లూ జెర్సీని ధరించనుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు ఈ జెర్సీలను ఆవిష్కరించాడు. కొవిడ్-19 కష్టకాలంలో తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా ఆర్సీబీ ఆటగాళ్లు ఈ జెర్సీలను ధరించనున్నారు. మ్యాచ్ అనంతరం ఈ జెర్సీలను వేలం వేస్తామని, వచ్చిన డబ్బులను దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్లు అందించేందుకు ఉపయోగిస్తామని కోహ్లీ తెలిపాడు.