ఆ మార్క్‌ దాటని ఆర్సీబీ.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-04-15T02:43:59+05:30 IST

ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ కనీసం 150 మార్క్ కూడా దాటలేకపోయింది. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి ఆర్సీబీ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో బ్యాట్స్‌మెన్‌పై ఆసాంతం..

ఆ మార్క్‌ దాటని ఆర్సీబీ.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

చెన్నై: ఐపీఎల్ 2021లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఆర్సీబీ కనీసం 150 మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ సిజన్‌తో 150 కంటే తక్కువ స్కోరు చేసిన తొలి జట్టుగా నిలిచింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో బ్యాట్స్‌మెన్‌పై ఆసాంతం ఒత్తిడి నెలకొండి. తొలుత ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్(11: 13 బంతుల్లో.. 2 ఫోర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన షాహబాజ్ అహ్మద్(14: 10 బంతుల్లో.. ఒక సిక్స్) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో.. 4 ఫోర్లు) నెమ్మదిగా ఆడాడు. అయితే 13వ ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన కోహ్లీ.. స్క్వేర్ లెగ్‌లో శంకర్ సూపర్ క్యాచ్‌కు బలయ్యాడు. 


ఇక ముంబైతో అద్భుతంగా ఆడిన ఏబీ డివిలియర్స్ ఒక్క పరుగుకే అవుట్ కావడంతో ఆర్సీబీ అభిమానులంతా షాక్‌కు గురయ్యారు. అయితే వీరిద్దరూ అవుటైనా గ్లెన్ మ్యాక్స్‌వెల్(59: 41 బంతుల్లో.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థసెంచరీతో రాణించి ఒంటరి పోరాటం చేశాడు. మ్యాక్సీ పోరాటంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మరికాసేపట్లో 150 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్ బరిలోకి దిగనుంది.

Updated Date - 2021-04-15T02:43:59+05:30 IST