Abn logo
Aug 4 2021 @ 01:17AM

రాయదుర్గంలో దొంగలు

కిరాణాదుకాణం, దేవాలయంలో చోరీ 

రూ.3.50 లక్షలు నగదు, 

12 తులాలు బంగారం అపహరణ

రూ.25 వేలు హుండీ సొమ్ము కూడా..

రాయదుర్గంటౌన, ఆగస్టు 3: పట్టణంలో దొంగలు పడ్డారు. శాంతినగర్‌లోని బూదారపు శ్రీనివాసులుకు చెందిన కిరాణాషాపు, ఇల్లు, బొడ్రా యి సమీపాన గల ఉక్కడ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవా రం రాత్రి దొంగలు చొరబడ్డారు. బూదారపు శ్రీనివాసులు, అతడి భార్య సరోజమ్మ, కుమారుడు ఉమాకాంతతో కలసి మొక్కులు తీర్చుకునేందుకు హుళిగి దేవస్థానానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూలేని విషయాన్ని గుర్తించిన దుండగులు సోమవారం అర్ధరాత్రి ఇంటి తాళాలను పగులగొట్టి, లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు పగులగొట్టి, అందులోని రూ.3.50 లక్షలు నగదు, 12 తులాల బంగారం అపహరించినట్లు శ్రీనివాసులు తెలిపాడు. చుట్టుపక్కల వారు ప్రజలు ఇంటి తలుపులు తె రచి వుంచిన విషయాన్ని గుర్తించి, ఫోన్లో సమాచారం అందించారు. దీం తో హుటాహుటిన బయలుదేరి వచ్చి, బీరువాను పరిశీలించగా డబ్బుతోపాటు బంగారు ఆభరణాలు చోరీ అయినట్లు బాధితుడు గుర్తించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. సీఐ ఈరణ్ణ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్రైమ్‌ పార్టీ పోలీసులు దొంగల వేలిముద్ర నమూనాలు సేకరించారు. బొడ్రాయి వద్ద వున్న ఉక్కడ ఆం జనేయస్వామి దేవాలయంలో హుండీ సొమ్ము దొంగలు అపహరించుకెళ్లారు. హుండీలో దాదాపు రూ.25 వేలు సొమ్ము చోరీ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ నిర్వాహకుడు టంకశాల హనుమం తు తెలిపారు. ఆలయంలోని సీసీ టీవీ ఫుటేజీలో దొంగ ప్రవేశించిన దృశ్యాలు నిక్షిప్తమైనట్లు దేవస్థానం అర్చకుడు వెంకటేష్‌ ఆచారి తెలిపారు. చోరీలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన సీఐ తెలిపారు.