అర్హులందరికి ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు

ABN , First Publish Date - 2021-06-24T04:42:22+05:30 IST

అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలను మం జూరు చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జీ పీవో, జంగారెడ్డిగూడెం ఆర్డీవో వైవి ప్రసన్నలక్ష్మి, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు.

అర్హులందరికి ఇళ్ల స్థలాల మంజూరుకు చర్యలు
బుట్టాయగూడెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే, ఆర్డీవో

బుట్టాయగూడెం, జూన్‌ 23: అర్హులైన పేదలందరికి ఇళ్ల స్థలాలను మం జూరు చేయాలని ఐటీడీఏ ఇన్‌చార్జీ పీవో, జంగారెడ్డిగూడెం ఆర్డీవో వైవి ప్రసన్నలక్ష్మి, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జగనన్న కాలనీల నిర్మాణంపై ఆర్డీవో, ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో పేదలకు కాలనీల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, అర్హులు ఎవరైనా ఉంటే గుర్తించి స్థలాలు మంజూరు చే యాలని రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులను ఆదేశించారు. అంతకముందు రెవెన్యూ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో ఆర్డివో రైతు భరోసా, సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలపై సమీక్ష చేసి పనులను వేగవంతం చేయాలన్నారు. గతంలో ఇచ్చిన కాలనీలు కూలి పోతున్నాయని, జగనన్న కాలనీల నిర్మాణంలో తమకు కూడా ఇళ్లు నిర్మిం చాలని అచ్చియ్యపాలెంకు చెందిన దళిత పేదలు ఎమ్మెల్యే తెల్లం బాలరా జును కలిసి విన్నవించుకున్నారు. కొయ్యలగూడెం, కన్నాపురం ప్రాంతాల్లోని కాలనీల్లో అవకాశం కల్పిస్తామని, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Updated Date - 2021-06-24T04:42:22+05:30 IST