Abn logo
Jul 6 2020 @ 05:46AM

ఇళ్ల పట్టాల పంపిణీ ప్రతిష్టాత్మకం: ఆర్డీవో

సర్పవరం జంక్షన్‌, జూలై 5: ఇల్లులేని పేదలకు ఈ నెల 8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు కాకినాడ ఆర్డీవో చిన్నికృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్‌ మండలం నేమాంలో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ఏర్పాటు చేస్తున్న పైలాన్‌ నిర్మాణం, ప్లాట్లు విభజన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 103 ఎకరాల విస్తీర్ణంలో చెరువులు, పోరంబోకు మినహాయించి, మిగతా 90 ఎకరాలను లేఔట్‌ చేసి 3,300 ప్లాట్లను పంపిణీకి సిద్ధం చేసినట్టు తెలిపారు. లబ్ధిదారుల పేరుపై ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్‌ చేసి అందించనున్నట్టు చెప్పారు. పైలాన్‌ నిర్మాణ పనులు, స్వాగత ద్వారం, మొక్కల నాటడం వంటి పనులు సత్వరం పూర్తిచేయాలని ఆర్డీవో ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.నారాయణమూర్తి, సర్వేయర్‌ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement