అనవసరంగా వీధుల్లోకి వస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2020-08-04T10:03:36+05:30 IST

అనవసరంగా వీధుల్లోకి వస్తే కఠిన చర్యలు తీసుకుని, జరిమానా విధిస్తామని ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ మెహబూబ్‌ బాషా హెచ్చరించారు.

అనవసరంగా వీధుల్లోకి వస్తే ఊరుకోం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 3 : అనవసరంగా వీధుల్లోకి వస్తే కఠిన చర్యలు తీసుకుని, జరిమానా విధిస్తామని ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ మెహబూబ్‌ బాషా హెచ్చరించారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు మచిలీపట్నంలో నిబంధనలు కఠినతరం చేసిన సందర్భంగా నగరంలో ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ మెహబూబ్‌ బాషా పర్యటించారు. పని పాటా లేకుండా రోడ్డుపై తిరిగే వారిని మందలించి జరిమానా విధించారు. ఆర్డీవో మాట్లాడుతూ డివిజన్‌లో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా మచిలీపట్నంతో పాటు బందరు మండలం, చల్లపల్లి, నాగాయలంకల్లో వారం రోజుల పాటు ఉదయం 9 గంటల వరకే షాపులు తెరిచి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు.  కరోనా మహమ్మారిని అరికట్టేందుకు  ప్రజలు సహకరించాలన్నారు. డీఎస్పీ ఎండి మెహబూబ్‌ బాషా మాట్లాడుతూ డివిజన్‌ పరిధిలో పోలీసులను అప్రమత్తం చేశామన్నారు. తహసీల్దార్‌ సునీల్‌బాబు, రూరల్‌ సీఐ కొండయ్య, ట్రాఫిక్‌ ఎస్సై మస్తాన్‌ఖాన్‌, చిలకలపూడి ఎస్సై సుభాష్‌ చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు. వృద్ధుడు (80) రోడ్డుపై కన్పించగా, ఆర్డీవో, డీఎస్పీలు వివరాలు తెలుసుకున్నారు.  అడిగి తెలుసుకున్నారు. పెడన మండలం నందిగం నుంచి వైద్యం చేయించుకునేందుకు చిన్నాపురం ఆసుపత్రికి వచ్చానని, మళ్ళీ పెడన వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు ఏమీ లేవని వృద్ధుడు గాజుల లక్ష్మణ ఆర్డీవోకు చెప్పారు. వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి వృద్ధుడిని, ఆర్డీవో ఖాజావలి, డీఎస్పీ మెహబూబ్‌బాషా ఆయన ఇంటికి పంపారు.   నిబంధనలతో రోడ్లు నిర్మానుష్యంగా కనబడ్డాయి.  

నాగాయలంకలో ఆంక్షలు కఠినతరం

నాగాయలంక  : సోమవారం నుంచి ఆదివారం వరకు నాగాయలంకలో లాక్‌డౌన్‌ ఆంక్షలు అధికారులు కఠినతరం చేశారు.  

Updated Date - 2020-08-04T10:03:36+05:30 IST