Abn logo
Jun 4 2020 @ 05:46AM

రూపాయి వసూలు చేసినా క్రిమినల్‌ కేసే

ఇసుక అదనపు వసూళ్లపై ఆర్‌డీవో ఆగ్రహం


కొవ్వూరు, జూన్‌ 3: ఇసుక ర్యాంపుల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని కొవ్వూరు ఆర్‌డీవో లక్ష్మారెడ్డి హెచ్చరిం చారు. బుధవారం రాత్రి ఆర్‌డీవో కార్యాలయంలో బోట్‌మెన్‌ సొసైటీ ప్రతిని ధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక సరఫరా ఆలస్యమవుతుందని కొన్ని చోట్ల అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.ర్యాంపుల్లో ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా క్రిమినల్‌ కేసులతో పాటు సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. దీనిపై మునిసిపల్‌, రెవెన్యూ,పంచాయతీ సిబ్బందిని పర్యవేక్షణకు ఏర్పాటు చేస్తున్నా మన్నారు.


ర్యాంపుల్లో ఇసుక నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది పూర్తిస్థాయిలో ఇండెంట్‌ అందించడంలేదని బోట్స్‌మెన్‌లకు బిల్లులు ఆలస్యమవుతున్నాయని ఆర్‌డీవో దృష్టికి తెచ్చారు. దీనిపై ఆర్‌డీవో స్పందించి ప్రతీ శనివారం బిల్లులు తయారు చేసి పంపడంతో పాటు ఇసుక నిల్వల సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, తహసీల్దార్‌, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement