రేపట్నుంచి రాత్రిళ్లు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-04-21T06:58:40+05:30 IST

కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత చర్యలలో భాగంగా మచిలీపట్నంలో ఈనెల 22వ తేదీ నుంచి రాత్రిళ్లు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు.

రేపట్నుంచి రాత్రిళ్లు లాక్‌డౌన్‌
బందరులో టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 20 : కరోనా  విజృంభిస్తున్న దృష్ట్యా ముందు జాగ్రత చర్యలలో భాగంగా మచిలీపట్నంలో ఈనెల 22వ తేదీ నుంచి  రాత్రిళ్లు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఖాజావలి తెలిపారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వర్తక, వాణిజ్య సంస్థలు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.  ఆర్డీఓ కార్యాలయంలో మంగ ళవారం టాస్క్‌ఫోర్సు సమావేశం జరిగింది. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, హోటల్‌ యజమానులు, థియేటర్ల యజ మానులతో ఆర్డీవో సమావేశం నిర్వహించారు.  రాత్రి  7 గంటల తరువాత సినిమా హాళ్లు, పెట్రోలు బంకులు  మూసి వేయాలన్నారు.  కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వాసుపత్రి నుంచి  లేడియాంప్తిల్‌ కళాశాలకు మార్చామన్నారు. కొవిడ్‌ అనుమానితులకు  ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆశీర్వాద్‌ భవన్‌లో స్ర్కీనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.  కొవిడ్‌ బారిన పడిన వారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆంధ్రా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ వార్డుల్లో చేర్చేందుకు అవకాశం కల్పించామన్నారు.   బందరు డీఎస్పీ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ, మెడికల్‌ షాపులు తప్ప మిగిలిన షాపులేవీ రాత్రి సమయాల్లో తెలిసి ఉంచడానికి వీల్లేదన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ ఆంక్షలు విధించామన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌ శివరామకృష్ణ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి నగరంలో తీవ్ర రూపం దాల్చకుండా ఉండేందుకు తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాల్సిందిగా కోరారు. మార్కెట్‌లలో ప్రజలు గుమిగూడ కుండా ఉండాలన్నారు. త్వరలో రైతు బజారును వికేంద్రీకరణ చేస్తామన్నారు. సచివాలయాల్లో కొవిడ్‌ కోవిడ్‌ వాక్సిన్‌ వేస్తున్నారని, వీటిని ప్రజలు సద్విని యోగపరచుకోవాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నగరపాలక సంస్థ కార్యాల యంలోని 08672- 227700 కు  ఫోను చేయ వచ్చన్నారు.  రైతు బజారు ఎస్టేట్‌ ఆఫీ సరు అమీర్‌ , తహసీల్దార్‌ సునీల్‌ బాబు,  అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ నాగశాస్ర్తులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మద్దుల గిరీష్‌,  హోటల్‌ యజమానుల సంఘం నాయ కులు బండి రామకృష్ణ, యెండూరి సురేష్‌,  మాటూరి పూర్ణ, దిలీప్‌, రామాంజనేయులు, రాంబాబు,  పవన్‌  పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:58:40+05:30 IST