కొవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-01-20T03:36:08+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ తరుముకొస్తున్న తరుణంలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శీనానాయక్‌ అధ్యక్షతన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది.

కొవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశం
కొవిడ్‌ నియంత్రణపై అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో శీనానాయక్‌

కావలి, జనవరి 19: కరోనా థర్డ్‌వేవ్‌ తరుముకొస్తున్న తరుణంలో కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై బుధవారం సాయంత్రం కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శీనానాయక్‌ అధ్యక్షతన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఎస్పీ ప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బీ. శివారెడ్డి, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ మండవ వెంకటేశ్వరరావు, తహసీల్దారు మాధవరెడ్డి తదితరులతో పాల్గొన్నారు. పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కొవిడ్‌ కేసులతో పాటు డివిజన్‌లోని వివిధ మండలాల్లో కొవిడ్‌ పాజిటీవ్‌ కేసులు ఎన్ని వస్తున్నాయి, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాజిటీవ్‌తో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్న వారికి అవసరమైన సేవలు ఎలా అందించాలనే దానిపై చర్చించారు. అలాగే హోమ్‌ ఐసోలేషన్‌కు అవకాశం లేని వారు కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి ప్రభుత్వం తరుపున ఎలాంటి చర్యలు చేట్టాలని చర్చించారు. పట్టణంలో మళ్లీ టిడ్కో గృహాల్లో కొవిడ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో చెప్పారు.

Updated Date - 2022-01-20T03:36:08+05:30 IST