సమస్యను పరిష్కరించిన ఆర్డీఓ

ABN , First Publish Date - 2021-06-18T04:55:11+05:30 IST

కొర్రపాడు పునరావాస కేంద్రంలోని వివాదాస్పద సమస్యను జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న ప్రజల సమక్షంలో పరిష్కరించారు.

సమస్యను పరిష్కరించిన ఆర్డీఓ
గ్రామస్థులతో మాట్లాడుతున్న ఆర్డీవో నాగన్న, డీఎస్పీ నాగరాజు

ముద్దనూరు జూన్‌17: కొర్రపాడు పునరావాస కేంద్రంలోని వివాదాస్పద సమస్యను జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న ప్రజల సమక్షంలో పరిష్కరించారు. వివరాల్లోకి వెళితే.. కొర్రపాడు పునరావాస ఎస్పీ కాలనీలో నెల రోజులుగా ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని భార్యకు  భార్యకు గాజులు తొలగించే  కార్యక్రమం చేపడుతున్నారని ఎస్సీ కాలనీ దళితులు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ సమస్య గ్రామంలో వివాదాస్పదంగా మారింది. దీంతో దళితుల అభ్యర్థన మేరకు గురువారం ఆర్డీవో నాగన్న, డీఎస్పీ నాగరాజు కొర్రపాడు గ్రామా న్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో నాగన్న కాలనీలోని వివాదాస్పద స్థలాన్ని పరిశీలించి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఎవరైనా వ్యక్తి చనిపోయినపుడు వారి భార్య గాజుల తొలగించే కార్యక్రమాన్ని గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ  వంక స్థలంలో నిర్వహించుకోవాలని  సూచించారు. ఎవ్వరూ కూడా నిబంధనలు ఉల్లంఘించరాదని అలా లేకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్ధారు మల్లిఖార్జున, సీఐ హరినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:55:11+05:30 IST