ఆరు నెలల్లో ఆర్డీఎస్‌ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-04-22T06:13:28+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌ పునరుద్ధరణను ఆరు నెలల్లో కేంద్రమే పూర్తిచేస్తోం దని, ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు.

ఆరు నెలల్లో ఆర్డీఎస్‌ పునరుద్ధరణ
సభలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

- చివరి ఆయకట్టు వరకు నీరందించి తీరుతాం  కేసీఆర్‌ సహకరించాలి 

- కేంద్రంపై ఏడవడం తప్ప  సీఎం కేసీఆర్‌ సాధించిందేమిటీ 

- గద్వాల సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌

-  రాయలసీమ నేతలకు వ్యతిరేకంగా  ఆర్డీఎస్‌ కోసం పోరాడింది మేమే  

- కాళేశ్వరంలో రద్దు చేసినట్లుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్‌నూ రద్దుచేయి 

- రెండు నియోజకవర్గాల మధ్య పంచాయితీ పెట్టేందుకు కేసీఆర్‌ కుట్ర

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు   డీకే అరుణ

మహబూబ్‌నగర్‌, గద్వాల (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్‌ పునరుద్ధరణను ఆరు నెలల్లో కేంద్రమే పూర్తిచేస్తోం దని, ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడతలో భాగం గా గురువారం తేరుమైదానంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ఆర్డీఎస్‌ ఆయ కట్టు కింద ఉన్న 87,500 ఎకరాలకు నీంరదిస్తామని స్పష్టం చేశారు. ఆర్డీఎస్‌ విషయంలో ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ నడిగడ్డను ఎడారిగా మార్చిన కేసీఆర్‌ను నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదం టూ ఏడవడం తప్ప కేసీఆర్‌ సాధించేందేమిటని ప్రశ్నించారు. కేంద్రం నిధులపై మాట్లాడటం తప్ప కేసీఆర్‌ ఇచ్చిన హామీల పై మాట్లాడటం లేదన్నారు. తాము ఎండకు వెరవ కుండా ప్రజాసమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేసుకుం టున్నామని, ప్రజల కష్టాలు చెబుతుంటే బాధగా ఉందన్నా రు. పాలమూరు పచ్చగా ఉందని అంటున్నారని, టీఆర్‌ఎస్‌ నేతలు నడిగడ్డకు వచ్చి.. పాలమూరు ఎక్కడ పచ్చగా ఉందో తెలపాలన్నారు. ఆర్డీఎస్‌ సమస్యల పరిష్కారం కోసం డీకే అరుణ కేంద్రానికి ఎన్నోసార్లు విన్నవించారని, అందరి కృషి మేరకు ఆర్డీఎస్‌ పునరుద్ధరణకు కేంద్రం ముందుకు వచ్చిం దని వివరించారు. ఇక నుంచి డీకే అరుణ కాదని, ఆర్డీఎస్‌ అరుణక్క అని అభివర్ణించారు. తెలంగాణ లో అరాచక పాలన సాగుతోందని, అవినీతి పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని దుయ్య బట్టారు. రాష్ట్రంలో కేసీఆర్‌ దద్దమ్మ పాలన వల్ల నడిగడ్డ ప్రజలు తలాపున నీళ్లున్నా.. కరువుతో అల్లాడుతున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాలు, ముఖ్య మం త్రి పదవి, దళితబంధు పేరుతో మోసం చేస్తున్నా రని అన్నారు. ఈ సభ ప్రజాసంగ్రామ యాత్ర సభ కాదని, ఆర్డీఎస్‌ విజయోత్సవ సభ అని తెలిపారు. 2023లో జరిగే ఎన్నికల్లో నడిగడ్డ ప్రజలు టీ ఆర్‌ఎస్‌ గడీలు బద్దలు కొట్టి కాషాయ జెండాను రెపరెపలాడిస్తారని బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముం దు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడుఅన్నామలైౖ కుప్పుస్వామి మాట్లాడుతూ 40 డిగ్రీల మండుటెండల్లో బండి సంజయ్‌ చేపట్టిన పాదయాత్ర తెలంగాణ ప్రజల ఆ కాంక్షలు నెరవేర్చేందుకేనని అన్నారు. తెలంగాణ  ప్రజల ఆకాం క్షలు నెరవేర్చాల్సిన సీఎం కేసీఆర్‌.. తన కుటుంబ ఆకాంక్షలు మాత్రమే నెరవేరుస్తున్నారని విమర్శించారు. ఆయనకు ప్రజల మీది కంటే కుటుంబం మీదనే ఎక్కువ ప్రేమ ఉందన్నారు. భారతదేశంలో అన్నివర్గాల ప్రజల కు ఇళ్లు, ఉద్యోగాలు, ఉపాధి కల్పన, రహదారులు, మరుగుదొడ్లు దేశాన్ని అభివృద్ధి చేసే పనిలో మోదీ ఉంటే.. సీఎం కేసీఆర్‌ అందుకు విరుద్ధంగా తన కుటుంబాన్ని బాగుచేసుకునే పనిలోనే ఉండిపోయారని అన్నా రు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ సర్కారు అవినీతి రహితంగా ఉంటే.. కేసీఆర్‌ పాలనలో మంత్రులపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయని అన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్యలో ఉన్న నడిగడ్డకు నీళ్లిచ్చే ప్రాజెక్టులు చేపట్టకుండా కమీషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిం చారని అన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు డబుల్‌ ఇంజిన్‌ సర్కారు రావాలని, అందుకు ఈ ప్రాంత ప్రజలు సహకరించా లని కోరారు. అంతకుముందు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ ఆర్డీఎస్‌ నీళ్ల కోసం రాయలసీమ నాయకులతో కొట్లాడింది తామేనని అన్నారు. ఆర్డీఎస్‌ను అడ్డం పెట్టుకుని తెలంగాణ ఉద్యమంతో అధికారంలోకి వచ్చారని, వచ్చిన తర్వాత ఆర్డీఎస్‌ ఆధునికీకరణను మరిచిపోయి.. నడి గడ్డ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తుమ్మిళ్లను తూతూమంత్రంగా ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పథకాలకు రూ. వెయ్యి కోట్లు ఇస్తే పాలమూరు సస్యశ్యామలం అయ్యేదని, తాము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిధులు ఇవ్వకుండా మోకాలడ్డారని అన్నారు. పేదల కోసం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మెడికల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాల, జేఎన్‌టీయూల కోసం ప్రతి పాదనలు పం పించానని, కానీ అవన్నీ గద్వాలకు రాకుండా వనపర్తికి తరలి పోయాయని అన్నారు. రాష్ట్రంలో అంతటా నర్సింగ్‌ కలాశాల లు మంజూరయ్యాయని, ఇక్కడే మంజూరైనట్లు పేదలకు తాను పట్టాలిచ్చిన ఇళ్ల స్థలాలు లాక్కున్నారని ఆరోపించారు. గట్టు ఎత్తిపోతల పథకం తాను ఉన్నప్పుడే నిధులు మంజూరు చేయించానని, 2018 ఎన్నికలప్పుడు కేసీఆర్‌ ప్రగల్భాలు పలికి.. ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర చేసి.. నడిగడ్డను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. పత్తా లేకుండా పోయారని విమర్శించారు. పాలమూరులో 7లక్షల ఎకరాలు పచ్చగా మారిందని చెబుతున్న కేసీఆర్‌.. ఆ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వా ల హయాంలోనే 90శాతం పనులు పూర్తయిన విషయాన్ని గుర్తుచేశారు. పాలమూరులో టీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా? అని నిలదీశారు. జీవో 69 అమలు చేయడం ద్వారా కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌ నియో జకవర్గాలకు నీరందించడాన్ని పట్టించుకోలేదని అన్నారు. పాలమూరు - రంగారెడ్డి కింద ఒక్క రిజర్వాయర్‌ కానీ ఒక్క పంప్‌హౌజ్‌ కానీ ఎందుకు పూర్తిచేయలేదన్నారు. గత ప్రభుత్వా ల హయాంలో నాలుగైదు ప్రతిష్టాత్మక పరిశ్రమలు పాలమూ రుకు వస్తే.. ఈ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు తేలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌, తమిళనాడు బీజేపీ సహ ఇంచార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌, డోకూరు పవన్‌కుమార్‌, గడ్డం కృష్ణారెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, అయ్యపురెడ్డి, స్నిగ్ధారెడ్డి, రామాంజనేయులు, పద్మావతి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-04-22T06:13:28+05:30 IST