లక్ష్యాన్ని చేరుకోవాలి

ABN , First Publish Date - 2020-09-24T08:43:37+05:30 IST

ప్రతీ రైస్‌మిల్‌ నుంచి రోజుకు 29 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని బయటకు వెళ్లాలని, అలా చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని

లక్ష్యాన్ని చేరుకోవాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి

అభివృద్ధి పనులు, ఎల్‌ఆర్‌ఎస్‌పై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌


నిజామాబాద్‌ అర్బన్‌, సెప్టెంబరు 23: ప్రతీ రైస్‌మిల్‌ నుంచి రోజుకు 29 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని బయటకు వెళ్లాలని, అలా చేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటామని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి ఆర్డీ వోలు, మున్సిపల్‌ కమిషనర్‌లు, మెప్మా, డీపీవో, పంచాయతీరాజ్‌ అధికారులతో కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌, రైతు వేదికలు, పల్లెప్రకృతివనాలు, వీధి వ్యాపారులు, నర్సరీలు, ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైస్‌మిల్లు దగ్గరి నుంచి ఎఫ్‌సీఐ దగ్గర ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చేయాలని, ఈనెల25 నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్‌లు రైస్‌మిల్లుల వద్దకు వెళ్లి రోజుకు 29 మెట్రిక్‌ టన్నులు వెళ్లేలా చూడాలన్నారు. సెలవు రోజులు కూడా పనిచేయాలన్నారు.  రైతువేదిక పనులు జిల్లాలో బాగా చేస్తున్నారని ఇంకా వేగవంతం చేసి పనులు చేయాలన్నారు. ఆర్మూ ర్‌లో కొంత ఆలస్యంగా పనులు జరుగుతున్నాయని, పునాది, లెంటిన్‌, రూఫ్‌లెవల్‌ కింద ఉన్న పనులన్నింటినీ వేగవంతం చేయాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు ప్రతీ గ్రామపంచాయ తీకి ఒకటి ఉండాలని, వీధి విక్రయదారుల గుర్తింపు వంద శాతం పూర్తిచేయాలన్నారు.


వీధి విక్రయదారుల గుర్తింపు నకు, అప్‌లోడ్‌కు ఒక్కొక్క టీమ్‌ను ఏర్పాటు చేసుకొని గురువారం సాయంత్రం వరకు అప్‌లోడ్‌ పూర్తిచేయాలన్నారు. న ర్సరీలను వచ్చే సంవత్సరం కోసం ప్లాన్‌ చేయాలన్నారు. వి విధ ప్రాంతాల్లో, బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో సెప్టెంబరు 30 వరకు నర్సరీ ప్రిపరేషన్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం బ్యాగులు, సీడ్‌ కలెక్షన్‌, భూపరీక్షలు వారంలో పూర్తిచేయాలన్నారు. పశువులు మేయని మొక్కల సీడ్‌ సేకరించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఒక్కో ఏరియాకు ఒక్కో అధికారిని పెట్టాలని, ఎక్కడైతే అనఽధికార లేఅవుట్‌లు, అనఽ దికార ప్లాట్లు ఉన్నాయో గుర్తించి వారితో ఎల్‌ఆర్‌ఎస్‌ అప్లై చేయించడం, వార్డుల వారీగా ఎల్‌ఆర్‌ఎస్‌ రిజిష్టర్‌ మెయింటెన్‌ చేయాలని అడ్రస్‌లు తీసుకొని వారితో నిరంతరం సం ప్రదించాలన్నారు.


ఎల్‌ఆర్‌ఎస్‌పై పక్కా ప్రణాళికతో వెళితే విజయవంతం అవుతామన్నారు. హరితహారం కింద ప్రతి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలని గ్రామాల్లో రోడ్డు సైడ్‌ మొ క్కలు 10 నుంచి 14 ఫీట్లు ఉండేలా నాటాలన్నారు. నర్సరీల్లో ఖాళీ లేకుంటే గ్రామాల్లో ఖాళీ స్థలాల్లో రోడ్‌సైడ్‌ ప్లాంటేషన్‌ చేయాలని, మున్సిపాలిటీల్లో కూడా పెద్ద మొక్కలు నా టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌లు లత, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ పాల్గొన్నారు. 


మొక్కలు పాడు చేసిన వ్యక్తికి జరిమానా..

వేంపల్లి, నాగంపేట్‌ గ్రామాల్లో హరితహారంలో నాటిన అవెన్యూ ప్లాంటేషన్‌లో రైతులు మొక్కజొన్న బూరు వేయడంతో మొక్కలు చనిపోయి. కలెక్టర్‌ విచారణ చేపట్టి దానికి కారణమైన అయిదుగురు రైతులకు రూ.5 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-09-24T08:43:37+05:30 IST