చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2021-01-17T05:22:54+05:30 IST

నారాయణపేట జిల్లాలో బీజేపీ, టీ ఆర్‌ఎస్‌ నాయకుల మధ్య అభివృద్ధిపై సోషల్‌ మీడియా వేదికగా శనివారం రభస జరిగింది.

చర్చకు సిద్ధమా?
బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

- సోషల్‌ మీడియా వేదికగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ సవాళ్లు

- అనుమతి లేదని అరెస్టు చేసిన పోలీసులు


నారాయణపేట టౌన్‌, జనవరి 16 : నారాయణపేట జిల్లాలో బీజేపీ, టీ ఆర్‌ఎస్‌ నాయకుల మధ్య అభివృద్ధిపై సోషల్‌ మీడియా వేదికగా శనివారం రభస జరిగింది. బీజేపీ నాయకులు చౌక్‌ బజార్‌లో బహిరంగ చర్చను ఉదయం 9 గంటలకు ఏర్పాటు చేస్తున్నామని, టీఆర్‌ఎస్‌ నాయకులు హాజ రు కావాలని సవాలు విసరడంతో, అందుకు టీఆర్‌ఎస్‌ నాయకులూ సిద్ధమ య్యారు. అయితే, బహిరంగ చర్చ ఏర్పాటుకు ఎలాంటి అనుమతి తీసుకోలే దని పోలీసులు పట్టణంలో మోహరించారు. తెల్లవారుజాము నుంచే ఇరు పార్టీల నాయకులను అరెస్టు చేశారు. బీజేపీ నాయకులను దామరగిద్ద పో లీస్‌ స్టేషన్‌కు తరలించగా టీఆర్‌ఎస్‌ నాయకులను స్థానిక పీఎస్‌కు తరలిం చారు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. ఒక సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని సవాళ్లకు ప్రతి సవాళ్లు విసరడం పట్ల పలువురు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి మాట్లాడుతూ బీజే పీ నాయకులు సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని కామెంట్లు పెట్టి రెచ్చ గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నారాయణపేట రూపు రేఖలు మారాయన్న సంగతి జిల్లా ప్రజల కు తెలుసని ఎమ్మెల్యే అన్నారు.

Updated Date - 2021-01-17T05:22:54+05:30 IST