రియల్‌ పంజా!

ABN , First Publish Date - 2022-09-10T05:32:39+05:30 IST

సమాజానికి దూరంగా అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగించే చెంచుల భూములపై రియల్‌ వ్యాపారుల కన్నుపడింది.

రియల్‌ పంజా!
నార్లపూర్‌ శివారులో చెంచులు సాగుచేసుకుంటున్న మామిడితోట

 సమాజానికి దూరంగా అడవి తల్లినే నమ్ముకొని జీవనం సాగించే చెంచుల భూములపై రియల్‌ వ్యాపారుల కన్నుపడింది. చెంచులు ఆర్థికంగా ఎదగాలని  25 సంవత్సరాల క్రితం భూమి కొనుగోలు పథకంలో భాగంగా  ఐటీడీఏ ఆధ్వర్యంలో భూమి కొనుగోలు చేసి చెంచుల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేసి వారికి హక్కులు కల్పించారు. ఈ భూములపై ప్రస్తుతం రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు  కన్ను వేశారు. చెంచుల భూములకు ధరలు కడుతూ వాటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు  చేస్తున్నారు.

కొల్లాపూర్‌, సెప్టెంబరు 9 : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొలా ్లపూర్‌ మండలం నార్లపూర్‌ శివారులోని సర్వే నెంబరు 82, 83, 84, 85, 86లలో మొత్తం 27ఎకరాల భూమిని 25సంవత్సరాల క్రితం చెంచుల ఐటీడీఏ సున్నిపెంట వారు ఎకరాకు 80వేల రూపాయలు వెచ్చించి ప్రైవేట్‌ వ్యక్తులతో కొనుగోలు చేశారు. మొత్తం 27 ఎకరాల భూమిని 27 చెంచు కుటుంబాలకు  రిజిస్ట్రేషన్‌ చేసి హ క్కులు కల్పించారు. నాటి నుంచి  నేటి వరకు చెంచులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నార్లపూర్‌ ఆశ్రమ పాఠశాల సమీపం లో రోడ్డుకు అనుసరించి చెంచుల భూములపై రియల్‌ వ్యాపారులు కన్నేశారు. చెంచులకు నయానో భయానో చెల్లించి  కొనుగోలు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ భూములు విక్రయించడానికి, కొనుగోలు చేయడానికి వీలులేదు. కేవలం చెంచుల వారసులకు మాత్రమే ఈ భూములపై పూర్తి హక్కులు ఉంటాయి. కానీ రియల్‌ వ్యాపారులు ఆ భూములు స్వాధీనం చేసు కునేందుకు  ఎకరాకు రూ. 15 లక్షలు చెల్లిస్తామని  ఎర వేస్తున్నారు.  

 ఇప్పటికే విక్రయించారు..

కొల్లాపూర్‌ మండలంలోని మొలచింతలపల్లి శివారులో సర్వే నెంబరు 255, 257, 259ల లో మొత్తం 12 ఎకరాల భూమిని 15 సంవత్సరాల క్రితం ఐటీడీఏ వారు కొనుగోలు చేసి 7మంది చెంచులకు రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారు. వీరి భూములను కూడా కొంతమంది కొనుగోలు చేసి వారిపై పట్టా మార్పిడి చేసుకున్నారు. ఇదే మాదిరిగా నార్లపూర్‌ శివారులో ఉన్న భూములపై రియల్‌ దందా కొనసాగిం చేందుకు ప్రయత్నాలు ప్రారంభమ య్యాయి. 

  హైవే పేరుతో రియల్‌దందా...

నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి వయా నార్లపూర్‌ మీదుగా కొల్లాపూర్‌, పెంట్లవెల్లి, చిన్నంబా వి చౌరస్తా నుంచి కృష్ణానది మీదుగా అలంపూర్‌ చౌరస్తా వరకు నూతనంగా ప్రతిపాదించిన హైవే పేరుతో ఇప్పటికే రియల్‌ దందా ప్రారంభించారు. భవిష్యత్తులో హైవే వస్తే ఈ రహదారి వెంట ఉన్న భూముల ధరలకు రెక్కలు వస్తాయని ఇప్పటి నుంచే  నార్లపూర్‌ రోడ్డుకు అనుసరించి ఉన్న చెంచుల భూ ములపై  వ్యాపారులు కన్నేశారు. 

Updated Date - 2022-09-10T05:32:39+05:30 IST