Saroor Nagar: హత్యా, ఆత్మహత్యా.?

ABN , First Publish Date - 2021-10-14T18:05:04+05:30 IST

మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధి బడంగ్‌పేట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న రియల్‌ కాంట్రాక్టర్‌ సైదులు కేసులో కొత్త కోణాలు బయటకు

Saroor Nagar: హత్యా, ఆత్మహత్యా.?

‘రియల్‌ కాంట్రాక్టర్‌’ కేసులో అనుమానాలు

వెలుగులోకి కొత్త కోణాలు 

బయటకు వచ్చిన ఆరు లెటర్లు

చదువు రాని సైదులు లెటర్లు ఎలా రాశాడు?

సంతకమే సరిగా రాయలేని వ్యక్తి ఇంగ్లిష్‌ పదాలతో లెటర్‌ రాయగలడా..? 

దర్యాప్తు ముమ్మరం 

సీసీటీవీ ఫుటేజీలు జల్లెడ పడుతున్న రాచకొండ పోలీసులు


హైదరాబాద్/సరూర్‌నగర్‌: మీర్‌పేట్‌ పోలీసుస్టేషన్‌ పరిధి బడంగ్‌పేట్‌లో ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్న రియల్‌ కాంట్రాక్టర్‌ సైదులు కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. సైదులుది హత్యా, ఆత్మహత్యా..? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైదులు సంతకంతో ఉన్న ఆరు లేఖలు బయటకు వచ్చాయి. అయితే సంతకం కూడా సరిగా చేయలేని సైదులు ఆరు లెటర్లు ఎలా రాశాడు. అందులో ఇంగ్లి్‌షలో కూడా రాసిన లెటర్‌ ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూడు లెటర్లలో రెండేసి పేర్లు, మరో మూడు లెటర్లలో ఒక్కొక్క పేరు చొప్పున రాసి సైదులు ఆత్మహత్యకు వీళ్లే కారణమని పేర్కొన్నట్లు ఉంది. పథకం ప్రకారం సైదులును అడ్డుతొలగించి లేఖలను వారే బయటపెట్టారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ లేఖలు ఎవరు రాశారు, వాటిలో పేర్కొన్న పేర్లకు, సైదులుకు ఏంటి సంబంధం ఏమిటి అనే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం సైదులు కుటుంబ సభ్యులు అందుబాటులో లేరు. వారు అందుబాటులోకి వస్తే మరింత లోతుగా విచారణ చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. లేఖలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు.


సీసీ ఫుటేజీ పరిశీలిస్తున్నాం: ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి

ఆత్మహత్యకు సంబంధించి సైదులు రాసినట్టుగా చెబుతున్న ఆరు లెటర్లపై అనుమానం ఉంది. సైదులు సంతకం పరిశీలిస్తే అతడికి చదువు రాదని స్పష్టమవుతుంది. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న బడంగ్‌పేట్‌లోని వెంచర్‌ వద్దకు సైదులు ఒక్కడే వెళ్లాడా, వెంట ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాలపై ఆరా తీస్తున్నాం. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. 

Updated Date - 2021-10-14T18:05:04+05:30 IST