నేతల మేతలు

ABN , First Publish Date - 2021-10-12T05:44:46+05:30 IST

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై కొందరి ప్రజా ప్రతినిధుల కళ్లు పడ్డాయి. అందులో తమకు వాటా కోసం పట్టుబడుతున్నారు. లేదంటే ఇబ్బందులు పెట్టేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు ప్రభుత్వ లిక్కర్‌ మాల్స్‌ను వదలడం లేదు. అద్దెల్లోనూ, అమ్మకాల్లోనూ వేలు పెడుతున్నారు.

నేతల మేతలు

 వెంచర్‌ వేస్తే కాసులు కక్కాల్సిందే

 ఎకరానికి రూ.10 లక్షలు 

 లిక్కర్‌ మాల్స్‌లోనూ వసూళ్ల దందా 

 ఆదాయం కోసం కొత్త మార్గాలు 


రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై కొందరి ప్రజా ప్రతినిధుల కళ్లు పడ్డాయి. అందులో తమకు వాటా  కోసం పట్టుబడుతున్నారు. లేదంటే ఇబ్బందులు పెట్టేందుకు వెనుకాడడం లేదు. మరోవైపు ప్రభుత్వ  లిక్కర్‌ మాల్స్‌ను వదలడం లేదు.  అద్దెల్లోనూ, అమ్మకాల్లోనూ వేలు పెడుతున్నారు. 


  కొత్త ఆదాయ మార్గాలు

కొన్ని పట్టణాలకు సమీపంలోవున్న పరిసర గ్రామాల్లోని పలుచోట్ల నాన్‌ లే అవుట్లు వెలుస్తున్నాయి. ఇలా వేసే ముం దు కొందరు ప్రజా ప్రతినిధులకు వాటాలు పంపించాలి. లేకుంటే వారు అధికారులతో ఇబ్బందులు పెట్టిస్తున్నారు. అక్కడి రహదారులను ఛిద్రం చేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థి తులు ఇటీవల జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. గతం లో అభివృద్ధి ప్రాజెక్ట్‌లు ఉండేవి. ఇబ్బడి ముబ్బడిగా పనులు నిర్వహించేవారు. వాటి నుంచి కమీషన్‌ రూపంలో నేతలకు సొమ్ము లందేవి. ఇప్పుడు ఆ పనులు మచ్చుకైనా జరగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిచేసిన పనులకే బిల్లు లు చెల్లించడం లేదు. దీంతో రెండేళ్లుగా వివిధ శాఖలు చేప డుతున్న పనులకు స్పందన కనిపించడం లేదు. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చి వరకు పనులు నిర్వహించేది లేదంటూ కాంట్రాక్టర్‌లు తీర్మానించారు. దీంతో ఈ పనులపై కమీషన్ల రూపంలో ఆదాయం రానట్టే ! ఫలితంగా ప్రత్యా మ్నాయ ఆదాయాలపై జిల్లాలో కొందరు ప్రజా ప్రతినిధులు కన్నేశారు. ప్రైవేటు ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టారు. ఎవరైనా వెంచర్లు వేస్తే ముందుగా ప్రజా ప్రతి నిధులను ప్రసన్నం చేసుకోవాలి. నాన్‌ లే అవుట్‌ అయితే ఎకరానికి రూ.10 లక్షలు, లే అవుట్‌కు రూ.5 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాలను ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలి. గతంలో ఈ నేతలు ప్రజా ప్రతినిధులుగా ఉన్నప్పుడు ఇటు వంటి దందాలేదు. అభివృద్ధి ప్రాజెక్ట్‌లు తెచ్చేవారు. అందులో నుంచి ఆదాయా న్ని ఆశించేవారు. అదే నేతలు ఇప్పు డు ప్రజా ప్రతినిధులుగా ఉన్నారు. కానీ వారిలో రాజకీయపరంగా, ఆదా య అన్వేషణపరంగా అనూహ్య మార్పు కనిపిస్తోందని అధికార పార్టీ శ్రేణులే బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నా యి. పార్టీ శ్రేణులకంటే నేతలకు సొంత ప్రయోజనాలే పరమావధిగా మారిపోయా యంటూ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.


వ్యాపార వర్గాల్లో ఆందోళన

నిర్మాణాలు చేపట్టాలంటే లక్షల్లో సొమ్ములు ముట్ట చెప్పాల్సి వస్తోందంటూ వ్యాపార వర్గాలు ఆందోళనలో ఉన్నాయి. పట్టణ నియోజక వర్గాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఇలాంటి దందా సాగిస్తున్నారు. లేదంటే వెంచర్లు వేయకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. లే అవుట్‌ వేసేందుకు అధికారుల వద్దకు వెళితే ముందుగా ప్రజా ప్రతినిధులను కలవాలని చెబుతున్నారు. ఈ ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి పోకడలు కనిపిస్తున్నాయి. జిల్లాలో జంట పట్టణాలుగా గుర్తింపు పొందిన ప్రాంతాల్లో వెంచర్‌లు అధికంగా ఉంటున్నాయి. వాటికి ఆనుకుని ఉన్న నియోజక వర్గాల్లోనూ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి జరుగుతోంది. ఎకరానికి నిర్ణీత సొమ్మును నిర్ధారించి వసూలు చేయడంలో నేతలు ఇప్పుడు ఆరితేరారు.  


లిక్కర్‌ మాల్స్‌లో..

మరో వైపు ప్రభుత్వ లిక్కర్‌ మాల్స్‌లోనూ కొందరు వేళ్లు పెట్టారు. తమకు అనుకూలంగా ఏర్పాటు చేయించు కున్నారు. అద్దెల్లోనూ మింగేస్తున్నారు. అమ్మకాల ద్వారా వచ్చే లాభాల్లోనూ వారికి సొమ్ములు చేరిపోతున్నాయి. ఇలా సొమ్ములు ఆర్జిం చడంలో నేతలు కొత్త కొత్త మార్గాలను ఎత్తుతున్నారు. జిల్లాలోని పలు పట్టణ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశమైంది.


Updated Date - 2021-10-12T05:44:46+05:30 IST