ముప్ఫై నాలుగవ స్థానంలో దేశీయ రియల్ ఎస్టేట్

ABN , First Publish Date - 2020-08-03T00:58:53+05:30 IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, రంగాలు కుదేలైన విషయం విదితమే. దేశీయ రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున క్షీణిస్తోన్న విషయం... ఇటీవల విడుదలైన పలు నివేదికల్లో వెల్లడైంది.

ముప్ఫై నాలుగవ స్థానంలో దేశీయ రియల్ ఎస్టేట్

హైదరాబాద్ : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, రంగాలు కుదేలైన విషయం విదితమే. దేశీయ రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున క్షీణిస్తోన్న విషయం... ఇటీవల విడుదలైన పలు నివేదికల్లో వెల్లడైంది.


అయితే... కరోనా ఉదృతిలోను దేశీయ రియల్ ఎస్టేట్... పారదర్శకత సూచీలో దూసుకువెళుతుందని జేఎల్ఎల్, లాసాల్లస్ బిన్నీయల్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ట్రాన్స్‌పరెన్సీ ఇండెక్స్  నివేదికను విడుదల చేసింది. దేశంలో ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల ఇన్వెస్టర్లలో పారదర్శకత నెలకొందని ఈ నివేదిక వెల్లడించింది.


దేశీయ రియల్ ఎస్టేట్ రంగం పారదర్శకత సూచీలో ప్రపంచంలోనే 34 వ స్థానంలో నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. దేశంలో పారదర్శకత పెరగడానికి గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హాబిటాట్ అసెస్‌మెంట్ తదితర సంస్థలు కీలకపాత్ర పోషించాయి. తాజా సర్వేలో కేవలం రియల్ ఎస్టేట్ రంగంతో పాటు 210 అంశాలలో పారదర్శకత, స్వయంసమృద్ధి తదితర అంశాలను సర్వే పరిగణనలోకి తీసుకొని నివేదికను రూపొందించారు. 

Updated Date - 2020-08-03T00:58:53+05:30 IST