ఓ చేయి, కాళ్లు కోల్పోయిన సైనికుడు.. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు..

ABN , First Publish Date - 2021-06-17T20:08:41+05:30 IST

కార్గిల్ వార్.. ఈ పేరు వినగానే పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం గుర్తుకొస్తుంది.

ఓ చేయి, కాళ్లు కోల్పోయిన సైనికుడు.. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు..

కార్గిల్ వార్.. ఈ పేరు వినగానే పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం గుర్తుకొస్తుంది. పొరుగున ఉన్న దయాది దేశం పాకిస్తాన్, మన దేశానికి మధ్య జరిగిన యుద్ధంలో వందలాదిమంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది కాళ్లు, చేతులు కోల్పోయి శాశ్వత అంగవికలాంగులయ్యారు. కార్గిల్ యుద్ధంలో ఓ సైనికుడు రెండు కాళ్లు, ఓ చేయిని కోల్పోయాడు.. అయినా అతను ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కాళ్లూ, చేయి లేదని కుంగిపోలేదు. గుండె నిబ్బరంతో.. ఆత్మస్థైర్యంతో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రెండు కాళ్లూ, ఓ చేయి లేకపోయినా.. ఉన్న ఆ ఒక్క చేత్తోనే పనులు చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక్క చేత్తోనే చెక్కపనిచేస్తూ కోట్లాదిమంది భారతీయుల హృదయాల్లో రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఇతనిది ఏ ప్రాంతమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆయన చెక్కపని చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలు సిసలైన భారతీయుడు అంటే ఇలా ఉండాలంటూ సెల్యూట్ చేస్తున్నారు. 

Updated Date - 2021-06-17T20:08:41+05:30 IST