బడ్జెట్ ధర, అదిరే ఫీచర్లు.. రియల్‌మి నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్లు

ABN , First Publish Date - 2021-04-09T02:54:32+05:30 IST

చైనీస్ మొబైల్ మేకర్ రియల్‌మి భారత్‌లో మరో మూడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మి సి-సిరీస్‌లో

బడ్జెట్ ధర, అదిరే ఫీచర్లు.. రియల్‌మి నుంచి మరో మూడు స్మార్ట్‌ఫోన్లు

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ రియల్‌మి భారత్‌లో మరో మూడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రియల్‌మి సి-సిరీస్‌లో ‘రియల్‌మి సి20’, ‘రియల్‌మి సి21’, ‘రియల్‌మి సి25’లను తీసుకొచ్చింది. ఈ ఏడాది మొదట్లోనే ఇవి ఇతర దేశాల్లో విడుదలయ్యాయి. రియల్‌మి సి20 2జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 6,999. రాయితీపై దీనిని రూ.6,799కే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ తొలి మిలియన్ కస్టమర్లకు మాత్రమే.


రియల్‌మి సి21 3 జీబీ ర్యామ్+32 జీస్టోరేజీ ఆప్షన్ ధర రూ. 7,999 కాగా, 4జీబీ+64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 8,999 మాత్రమే. రియల్‌మి సి25 4జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజీ కన్ఫిగరేషన్ ధర రూ. 9,999 కాగా, 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 10,999 మాత్రమే.


రియల్‌మి సి20 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), రియల్‌మి యూఐతో కూడిన ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 6.5 హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జి35 ఎస్ఓసీ, 2 జీబీ ర్యామ్, వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 5 ఎంపీ కెమెరా, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 256 జీబీ వరకు అంతర్గత మొమొరీని పెంచుకునే వెసులుబాటు, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ఈ నెల 13 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.   


రియల్‌మి సి21 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 10 ఆధారిత యూఐ ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, అండర్ ది హుడ్, ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జి35 ఎస్ఓసీ, 4 జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం ముందువైపు 5 ఎంపీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ఈ నెల 14 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి డాట్ కామ్‌తోపాటు రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేసుకోవచ్చు. 


రియల్‌మి సి25 స్పెసిఫికేషన్లు: డ్యూయల్ సిమ్ (నానో), రియల్‌మి యూఐ 2.0తో కూడిన ఆండ్రాయిడ్ 11 ఓఎస్, 6.5 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి70 ఎస్ఓసీ, 4జీబీ ర్యామ్, 13 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు మూడు కెమెరాలు, ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 64, 128 జీబీ స్టోరేజీ వేరియంట్లు, మెమొరీని పెంచుకునేందుకు మైక్రో ఎస్డీ స్లాట్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ను 16వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి వెబ్‌సైట్, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. 

Updated Date - 2021-04-09T02:54:32+05:30 IST