ప్రగతికి పునరంకితం

ABN , First Publish Date - 2022-01-27T05:21:10+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి పథకాల ద్వారా జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, తద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును వివరించారు. జిల్లాలో 1058 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు వాటి ద్వారా ప్రజల నుంచి 20.07 లక్షల వినతులు రాగా 20.03 లక్షల పరిష్కారించామన్నారు.

ప్రగతికి పునరంకితం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒంగోలు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి అభివాదం చేస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఎస్పీ మలికగర్గ్‌, ఎంపీ మాగుంట (ఇన్‌సెట్లో) మాట్లాడుతున్న కలెక్టర్‌

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌  

ప్రవీణ్‌కుమార్‌ పిలుపు

పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ

పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరణ

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

115 మందికి ప్రశంసాపత్రాలు 

ఒంగోలు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : 


గణతంత్ర వేడుకలు జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా జరిగాయి. ఊరూరా త్రివర్ణపతాకాలు రెపరెపలాడాయి. ఒంగోలులోని పోలీసుపరేడ్‌ గ్రౌండ్స్‌లో అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. జిల్లాను ప్రగతిపథంలో నిడిపేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అనంతరం విధి నిర్వహణలో మెరుగైన సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 115 మందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధిని తెలియజేస్తూ ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. కరోనా తీవ్రత దృష్ట్యా ఈసారి వేడకలు నిరాడంబరంగా నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను రద్దు చేశారు.  

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధికి పథకాల ద్వారా జిల్లాను ప్రగతిపథంలో నడిపేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో బుధవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, తద్వారా ప్రజలకు జరుగుతున్న మేలును వివరించారు. జిల్లాలో 1058 గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు వాటి ద్వారా ప్రజల నుంచి 20.07 లక్షల వినతులు రాగా 20.03 లక్షల పరిష్కారించామన్నారు. స్పందనకు 1,89,976 ఆర్జీలు అందగా 98.92శాతం పరిష్కారం అయ్యాయని చెప్పారు. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు భరోసా, సున్నా వడ్డీ, ఆసరా, పెన్షన్లు, బీమా, వాహన మిత్ర తదితర పథకాల లబ్ధిని వివరించిన కలెక్టర్‌ శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం కింద జిల్లాలోని మూడు గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేపట్టామన్నారు. 

ఆగస్టుకు వెలిగొండ తొలి దశ పూర్తి

శాశ్వత అభివృద్ధి పనుల్లో కీలకమైన వెలిగొండ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టుకు తొలిదశ పూర్తి చేసి మూడువేల క్యూసెక్కుల నీటిని తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1595.39 కోట్లు మంజూరయ్యాయని రెండోదశ పనులు కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రామయపట్నం పోర్టు కోసం 847 ఎకరాలు, పారిశ్రామిక హబ్‌కోసం 3773 ఎకరాలు వెరసి 4620 ఎకరాలు భూమి అవసరం కాగా భూసేకరణ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఉపాధి హామీ పథకం కింద ఈ ఏడాది 2.22 కోట్ల పని దినాల కల్పన లక్ష్యం కాగా 2.01 కోట్లు ఇప్పటి వరకు కల్పించినట్లు తెలిపారు. ఈ  పథకం కింద రూ.731 కోట్లు వ్యయం చేశామన్నారు. పలు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని ఈ సందర్భంగా కలెక్టర్‌ వివరించారు. అనంతరం విధి నిర్వహణలో మెరుగైన సేవందించిన వివిధ శాఖలకు చెందిన 115 మందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. తొలుత జాతీయ జెండావిష్కరణ అనంతరం ఎస్పీ మలికాగర్డ్‌ తో కలిసి పరేడ్‌ గ్రౌండ్‌లో తిరిగి పోలీసుల నుంచి కలెక్టర్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీసు బృందాలు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లివెంకాయమ్మ, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఎమ్మెల్సీ పోతుల సునీత, ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, జేసీలు వెంకట మురళి, చేతన్‌, కృష్ణవేణి, డీఆర్వో పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

నిరాడంబరంగా వేడుకలు

సాధారణంగా భారీగా సాగే గణతంత్ర వేడుకలు ఈసారి నిరాడంబరంగా సాగాయి. కరోనా ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం పరిమితంగా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఒంగోలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో స్టాల్స్‌, సాంస్కృతిక కార్యక్రమాల రద్దుతోపాటు ప్రశంసాపత్రాలు అందజేతను కుదించారు. విద్యార్థులను అనుమతించకుండా అధికారులు, మీడియా, పోలీసు శాఖలకే పరిమితం చేశారు.   జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో  జెండా విష్కరణలు చేశారు. అలాగే పలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోనూ గణతంత్ర వేడుకలను స్థానికంగా నిర్వహించారు. 

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

వివిధ ప్రభుత్వ శాఖల పురోగతిని వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా సాగింది.  వ్యవసాయ, అనుబంధ శాఖలు, విద్యాశాఖ, పంచాయతీ, డీఆర్‌డీఏ, డ్వామా, వైద్యారోగ్యశాఖ, గృహ నిర్మాణ శాఖల ఆధ్వర్యంలో శకటాలు ఏర్పాటు చేశారు. ఆయా శాఖల అధికారులు శకటాల ముందుండి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు.


Updated Date - 2022-01-27T05:21:10+05:30 IST