రక్తహీనతకు కారణమేంటంటే..

ABN , First Publish Date - 2021-02-18T21:05:51+05:30 IST

రక్తం మనకు ప్రాణ శక్తినిస్తుంది. శరీరంలోని అన్ని జీవ కణాలకు అవసరమయ్యే ఆక్సిజన్‌, పోషకాలను అందించడమే కాక, రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు, మాక్రోఫేజెస్‌, యాంటీ బాడీస్‌ మొదలైనవన్నీ రక్తం ద్వారానే శరీరమంతా చేరుతాయి. రక్తంలోని ఎర్రరక్త కణాలు

రక్తహీనతకు కారణమేంటంటే..

ఆంధ్రజ్యోతి(17-02-2021)

ప్రశ్న: రక్తహీనత... ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- గోవింద్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: రక్తం మనకు ప్రాణ శక్తినిస్తుంది. శరీరంలోని అన్ని జీవ కణాలకు అవసరమయ్యే ఆక్సిజన్‌, పోషకాలను అందించడమే కాక, రోగనిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్త కణాలు, మాక్రోఫేజెస్‌, యాంటీ బాడీస్‌ మొదలైనవన్నీ రక్తం ద్వారానే శరీరమంతా చేరుతాయి. రక్తంలోని ఎర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. దీనినే అనీమియా అంటారు. దీనికి ప్రధాన కారణం ఐరన్‌ లోపం. ఐరన్‌ బాగా తక్కువగా ఉన్నప్పుడు కేవలం ఆహారంలో మార్పులతో దానిని పెంచడం సాధ్యం కాదు. మందులు లేదా సప్లిమెంట్లు వాడాలి. అయితే మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఐరన్‌ స్థిరపడేలా చూసుకోవచ్చు. మాంసాహారులైతే కోడి, చేప లాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్‌ లభిస్తుంది. శాకాహారులైతే అన్నిరకాల పప్పులు, నల్ల శనగలు, అలసందలు, ఉలవలు, సోయాబీన్స్‌, చిక్కుళ్లు మొదలైనవి రోజూ తీసుకోవాలి. తోటకూర, పాలకూర, గోంగూర తప్పనిసరి. మీరు ఐరన్‌ సప్లిమెంటు తీసుకుంటు న్నట్లయితే వాటిని ఉదయాన్నే పరగడుపునే వేసుకోవాలి. నిమ్మ,నారింజ లాంటి విటమిన్‌- సి అధికంగా ఉన్న పండ్లు, రసాలను తీసుకుంటే మందులలోని ఐరన్‌ను శరీరం పూర్తిగా పీల్చుకోగలుగుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2021-02-18T21:05:51+05:30 IST