భారత పౌరసత్వం వదులుకుంటున్న ఎన్నారైలు! కారణాలు ఇవే..

ABN , First Publish Date - 2021-12-04T02:40:42+05:30 IST

గత ఐదేళ్లలో ఏకంగా ఆరు లక్షల మందికిపైగా ప్రవాసీ భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారన్న వార్త ఇటీవల వైరల్ అయింది. స్వయంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో.. అసలు ఎన్నారైలు ఎందుకు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే..

భారత పౌరసత్వం వదులుకుంటున్న ఎన్నారైలు! కారణాలు ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: గత ఐదేళ్లలో ఏకంగా ఆరు లక్షల మందికిపైగా ప్రవాసీ భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారన్న వార్త ఇటీవల వైరల్ అయింది. స్వయంగా ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో.. అసలు ఎన్నారైలు ఎందుకు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే.. ప్రవాసీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.


డ్యుయెల్ సిటిజన్‌షిప్‌ సౌకర్యం లేకపోవడం..

విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న వాళ్లు కచ్చితంగా భారత పౌరసత్వాన్ని వదులుకోక తప్పదు. డ్యుయెల్ సిటిజన్‌షిప్‌ను భారత్ అనుమతించదు. దీంతో..విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న అనేక మంది తమ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే.. ఇటువంటి వారందరూ ఓవర్సీస్ సిటిజన్‌ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఓసీఐ ద్వారా ప్రవాసీయులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, నివాసం ఉండేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుంది.  


గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రివ్యూ ఇటీవల జరిపిన అధ్యయనంలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ నివేదిక ప్రకారం..2020లో దాదాపు 7 వేల మంది భారతీయ సంపన్నులు విదేశాలకు తరలిపోయారు. అయితే..ఈ విషయంలో చైనా అందరికంటే ముందుంది. ఆ కమ్యూనిస్టు దేశం నుంచి 2020లో ఏకంగా 16 వేల మంది సంపన్నులు ఇతర దేశాలకు వెళ్లిపోయారట. అంతేకాకుండా...విదేశాల్లో పెట్టుబడులు పెట్టి పౌరసత్వం పొందాలనుకుంటున్న వారిలో భారతీయులే ముందున్నారని సమాచారం. 


గోల్డెన్ వీసాపై ఆసక్తి..

పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో కొన్ని దేశాలు ప్రవేశపెట్టిన పథకం ఇది. దీని ప్రకారం.. తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే అపర సంపన్నులకు ఆ దేశ ప్రభుత్వం ఈ పథకం ద్వారా పౌరసత్వం లేదా శాశ్వత నివాసార్హతను కల్పిస్తుంది. ఐరోపా దేశాలైన మాల్టా, గ్రీస్, పోర్చుగల్ ఇచ్చే గోల్డెన్ వీసాలపై భారతీయ హెచ్ఎన్‌ఐలు(అపర కుబేరులు) ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం తొమ్మిది దేశాలే ఇటువంటి వీసాను ఇస్తున్నాయి. 


భారత‌ పాస్‌పోర్టుకు ఉన్న పరిమితులు..

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత పాస్‌పోర్టుకు ఉన్న ర్యాంకు 85. ఈ పాస్ పోర్టు ద్వారా 58 విదేశీ గమ్యస్థానాలకు ఎటువంటి వీసా అవసరం లేకుండానే వెళ్లిపోవచ్చు. కానీ.. ఇతర దేశాలతో పోలిస్తే..ఇది కొంత తక్కువనే అభిప్రాయం ఉంది.  అమెరికా లాంటి పాస్ పోర్టుతో 100కుపైగా విదేశీ గమ్యస్థానాలకు వీసా అవసరం లేకుండానే చేరుకోవచ్చు. అక్కడికెళ్లాక వీసా పొందవచ్చు. సంపన్నులు విదేశాలకు తరలిపోయేందుకు ఇది కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 


Updated Date - 2021-12-04T02:40:42+05:30 IST