Advertisement
Advertisement
Abn logo
Advertisement

నన్ను తిట్టారు.. YSRCP ఎంపీలు అన్నం తింటున్నారా..? : రఘురామ

అమరావతి/ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల్లో రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజును వైసీపీ ఎంపీలు టార్గెట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే.. మంగళవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన రఘురామ కౌంటర్‌గా మాట్లాడారు. అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌ విషయంపై కూడా ఎంపీ మాట్లాడారు. హైకోర్టులో కేసుల విచారణకు హాజరుకాలేనని జగన్ చెప్పారని.. అయితే ఆ నిర్ణయం కుదరదని సీబీఐ తేల్చిచెప్పిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. సీఎం అయినా కోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని.. హైకోర్టులో జగన్‌ బెయిల్ రద్దు పిటిషన్ అడ్మిట్ అయిందన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌ త్వరలోనే హైకోర్టులో విచారణకు వస్తుందని రఘురామ చెప్పుకొచ్చారు.


మా పార్టీ దెబ్బతింటోంది..!

రైతుల గురించి మాట్లాడితే నన్ను తిట్టారు. అసలు వైసీపీ ఎంపీలు అన్నం తింటున్నారా.. గడ్డి తింటున్నారా?. అన్ని విషయాలు కేంద్రానికి, బీజేపీకి చెప్పే చేస్తున్నామని విజయసాయి, వైసీపీ నేతలు అనేకసార్లు అన్నారు. ఇప్పుడు నేను బీజేపీకి దగ్గర అవుతున్నా అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వ దాష్ఠికాల గురించే నేను మాట్లాడాను. రాక్షస పాలన వల్ల మా పార్టీ దెబ్బతింటోంది. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోగా వారిని రెచ్చగొడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాసరావును అన్ని విధాలుగా బెదిరించారు. జగన్ చెప్పినట్లు అన్నిటిపైనా అధికారులు బాదేస్తున్నారు. మంచి చేస్తానంటూ వచ్చి ప్రజలను ముంచుతున్నారు. పరదలు కట్టి వరద ప్రాంతాలను సందర్శించిన ఏకైక సీఎం జగన్అని రఘురామ వ్యంగ్యంగా మాట్లాడారు.

Advertisement
Advertisement