Abn logo
Sep 28 2021 @ 16:58PM

రూ. 85 వేల కోట్ల సమీకరణకు ఆర్‌ఈసీకి ఆమోదం

హైదరాబాద్ : నాన్-కన్వర్టబుల్ బాండ్లు లేదా డిబెంచర్ల జారీ ద్వారా రూ. 85 వేల కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్‌ఈసీకి షేర్‌హోల్డర్లు ఆమోదం వ్యక్తం చేశారు. ‘సంస్థ 52 వ వార్షిక సర్వసభ్య సమావేశం నోటీసులో పేర్కొన్న అన్ని తీర్మానాలను తగిన మెజారిటీతో షేర్‌హోల్డర్స్ ఆమోదం పొందాయి’ అని బీఎస్ఈ ఫైలింగ్ తెలిపింది. సెప్టెంబరు  24 న జరిగిన 52 వ వార్షిక సర్వసభ్య సమావేశం నోటీసు ప్రకారం ఈ నిధులను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ప్రైవేటు ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన సేకరించవచ్చు. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, వంతెనలు, గ్యాస్ పైప్‌లైన్‌ల వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిధుల వంటి వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి కంపెనీ అసోసియేషన్ యొక్క మెమోరాండం ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్లాజ్‌లో మార్పు చేయాలని కంపెనీ ప్రతిపాదించింది.