కేసీఆర్‌తోనే ఉద్యమకారులకు గుర్తింపు

ABN , First Publish Date - 2022-01-25T06:22:20+05:30 IST

తెలంగాణ ఉద్యమ కారులను గౌరవించే సంప్రదాయం సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన చైర్మన దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్‌ అన్నారు.

కేసీఆర్‌తోనే ఉద్యమకారులకు గుర్తింపు
బాలరాజుయాదవ్‌ను సన్మానిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి

గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన చైర్మన కార్పొరేషన చైర్మన బాల్‌రాజ్‌యాదవ్‌ 

భువనగిరి టౌన, జనవరి 24: తెలంగాణ ఉద్యమ కారులను గౌరవించే సంప్రదాయం సీఎం కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన చైర్మన దూదిమెట్ల బాల్‌రాజ్‌యాదవ్‌ అన్నారు. భువనగిరిలో సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని జీవాల పెంపకందారులకు ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు గొర్రెల యూనిట్లు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కేసీఆర్‌ను విమర్శించడం మాని జరుగుతున్న అభివృద్ధిని గ్రహించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశలో ఏ పార్టీ కూడా యాదవ వర్గానికి రాజ్య సభ సీట్లు ఇవ్వలేదని, ఇప్పటి ఏపీలో కూడా ఆ వర్గానికి చెందిన నాయకులు కోట్ల రూపాయలతో పదవులను కొనుక్కుంటున్నారని అన్నారు. తెలంగాణలో మాత్రమే యాదవ వర్గానికి సీఎం న్యాయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సీఎం లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గొల్లకురుమలంటేనే విశ్వాసానికి, కష్టానికి ప్రతీకలని అన్నారు. మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌ మాట్లాడుతూ గొల్లకురుమ వర్గానికి చెందిన గ్రామ పూజారులకు త్వరలో శిక్షణ ఇచ్చి సంబంధిత ఆలయాల్లో పూజారులుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గొల్ల కురుమల సంఘం ఆధ్వర్యంలో బాలయ్య యాదవ్‌ను ఘనంగా సత్కరించారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అమర వీరుల స్మారక స్తూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఆయిల్‌ ఫెడ్‌  కార్పొరేషన చైర్మన కంచర్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ, రైతు బంధు చైర్మన్లు డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, కొలుపుల అమరేందర్‌, మునిసిపల్‌ చైర్మన ఎనబోయిన అంజనేయులు, ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, కురుమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రసిడెంట్‌ క్యామ మల్లేశం, జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడు అయోధ్య యాదవ్‌ పాల్గొన్నారు. 

 విభజన చట్టం హామీలను అమలు చేయాలి : ఎంపీ బడుగుల 

రాష్ట్ర విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు. భువనగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 13వ షెడ్యూల్‌లోని హామీలను కేంద్రం నెరవేరిస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరుగకపోతే ప్రజా  క్షేత్రంలో తెలంగాణ ప్రజలతో కలిసి బీజేపీతో యుద్ధం చేస్తామని పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-25T06:22:20+05:30 IST